36 గంటలు.. 4 రాష్ట్రాలు, 5 నగరాల్లో మోడీ పర్యటనలు .. రూ.50 వేల కోట్ల ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు

Siva Kodati |  
Published : Jul 04, 2023, 06:55 PM IST
36 గంటలు.. 4 రాష్ట్రాలు, 5 నగరాల్లో మోడీ పర్యటనలు .. రూ.50 వేల కోట్ల ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ 7, 8 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఛత్తీస్‌గఢ్, యూపీ, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ పర్యటన జరగనుంది. ఈ సందర్భంగా దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన 50 ప్రాజెక్ట్‌లను ఆయన ప్రారంభించనున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ 7, 8 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఛత్తీస్‌గఢ్, యూపీ, తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ పర్యటన జరగనుంది. రాయపూర్, గోరఖ్‌పూర్, వారణాసి, వరంగల్ , బికనీర్ నగరాల్లో జరిగే డజను కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. దాదాపు రూ.50 వేల కోట్ల విలువైన 50 ప్రాజెక్ట్‌లను ఆయన ప్రారంభించనున్నారు. 7వ తేదీన ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి రాయ్‌పూర్‌కు చేరుకుని అక్కడ పలు శంకుస్థాపనలు , పలు ప్రాజెక్ట్‌లను జాతికి అంకితం చేస్తారు. వీటిలో రాయ్‌పూర్-విశాఖపట్నం కారిడార్‌లోని ఆరు లేన్‌ల విభాగాలకు పునాదిరాయి వేసి బహిరంగ సభలో పాల్గొంటారు. 

అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు మోడీ చేరుకుంటారు. గీతా ప్రెస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని, అనంతరం 3 వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. గోరఖ్‌పూర్ నుంచి ప్రధాని తన సొంత నియోజకవర్గం వారణాసికి వెళతారు. పలు కీలక ప్రాజెక్ట్‌లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. అనంతరం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి సోన్ నగర్ వరకు నిర్మించిన ప్రత్యేక సరుకు రవాణా కారిడార్‌ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. అలాగే వారణాసిలోని మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ పునరుద్ధరణకు కూడా మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 

8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు. వరంగల్‌‌‌లో ఖాజీపేట ఓవర్ హాలింగ్ ప్లాంట్‌కు ఆయన శంకుస్థాపన చేస్తారు. నాగపూర్-విజయవాడ కారిడార్‌లోని కీలక విభాగాలు ప్రాజెక్ట్‌లకు ప్రధాని భూమిపూజల చేస్తారు. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా మార్చే పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. 

అనంతరం వరంగల్ నుంచి రాజస్థాన్‌లోని బికనీర్‌కు చేరుకుని అక్కడ పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేసి, మరికొన్నింటినీ జాతికి అంకితం చేస్తారు. అమృత్‌సర్ జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వేలోని వివిధ విభాగాలను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్ 1, ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కూడా ఆయన మోడీ జాతికి అంకితం చేస్తారు. తర్వాత బికనీర్ రైల్వే స్టేషన్ ఆధునికీరరణ పనులకు మోడీ శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం