శంకరాచార్యుల సలహాలు, మతపరమైన పద్దతులు విస్మరించి రామాలయ ప్రారంభం - కాంగ్రెస్

By Sairam Indur  |  First Published Jan 12, 2024, 3:36 PM IST

అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని (ayodhya prana pratishtha program) బీజేపీ (BJP) ఒక పొలిటికల్ ఈవెంట్ (Political event)లాగా మార్చేంసిందని కాంగ్రెస్ (congress) ఆరోపించింది. అసంపూర్తిగా ఉన్న రామాలయంలో ప్రాణ ప్రతిష్ట చేయబోమని నలుగురు శంకరాచార్యులు (shankaracharya)చెప్పారని, కానీ కేంద్రంలోని బీజేపీ దానిని విస్మరించిందని తెలిపింది.


శంకరాచార్యుల సలహాలు తీసుకోకుండా, మతపరమైన పద్ధతులను విస్మరించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్నినిర్వహిస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దీనిని ఒక పొలిటికల్ ఈవెంట్ లాగా మార్చిందని ఆరోపించింది. మతం వ్యక్తిగత విషయమని, అయోధ్యకు దర్శనం కోసం ఎవరైనా వెళ్లవచ్చని పేర్కొంది. అయితే ఈ కార్యక్రమంలో భారీ రాజకీయం జరుగుతోందని ప్రతిపక్ష పార్టీ అనుమానం వ్యక్తం చేసింది. 

విమానం డోర్ తెరిచి దూకేసిన ప్రయాణికుడు..

Latest Videos

ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ విభాగాధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ.. మతపరమైన ఆచారాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. శంకరాచార్యుల సలహా మేరకు మతపరమైన పద్ధతులను దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్నారా అని ఖేరా ప్రశ్నించారు. అసంపూర్తిగా ఉన్న ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమం చేయలేమని నలుగురు శంకరాచార్యులు చెప్పారని అన్నారు. 

ఒక రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు తనకు, తన దేవుడికి మధ్య మధ్యవర్తులుగా మారడాన్ని సహించబోనని అన్నారు. ‘ఆహ్వానం వచ్చిన తర్వాత దేవుడి గుడికి వెళ్తారా అనేది నా మొదటి ప్రశ్న. గుడి అయినా, చర్చి అయినా, మసీదు అయినా ఆహ్వానం కోసం ఎదురుచూస్తుంటాం. ఏ తేదీన, ఏ వర్గం ప్రజలు వెళ్లాలో ఎవరు నిర్ణయిస్తారు? రాజకీయ పార్టీ నిర్ణయిస్తుందా? బీజేపీ ఐటీ సెల్ శంకరాచార్యులకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించింది’’ అని తెలిపారు.

ధర్మం, విశ్వాసం లేవని, ఇందులో రాజకీయాలు మాత్రమే ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపించారు. ప్రాణ ప్రతిష్టకు తేదీ ఎలా నిర్ణయించారో తెలుసుకోవాలని అనుకుంటున్నామని అన్నారు. ఒక వ్యక్తి రాజకీయ తమాషా కోసం, తమ విశ్వాసం, దేవుడితో ఆడుకోవడానికి ఎవరినీ అనుమతించబోమని చెప్పారు. శ్రీరామనవమి రోజున ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించాలని మత పెద్దలు భావించారని ఖేరా పేర్కొన్నారు 

గబ్బిలాలకు పూజలు.. లక్ష్మీదేవిగా కొలుస్తున్న ఆ వింత గ్రామం.. ఎందుకో తెలుసా ?

అనంతరం కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం అధిపతి సుప్రియా శ్రీనాటే మాట్లాడుతూ.. ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకాకూడదని పార్టీ అగ్రనేతలు నిర్ణయించడంపై బీజేపీ విమర్శలు చేసిందని అన్నారు. కులం, మతం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజించిన బీజేపీ ఇప్పుడు సనాతన ధర్మాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ వ్యక్తిగత విశ్వాసాన్ని అత్యున్నతమైనదిగా భావిస్తుందని, దేవాలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్లామని, వ్యక్తిగత విశ్వాసాల ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు. జనవరి 15న అయోధ్యను సందర్శించాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు ఇప్పటికే నిర్ణయించారని శ్రీనాటే గుర్తు చేశారు.

click me!