జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలపై సుప్రీం కీలక ఆదేశాలు

By narsimha lodeFirst Published Jan 10, 2020, 11:27 AM IST
Highlights

జమ్మూ కాశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను పునరుద్దరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 


న్యూఢిల్లీ: జమ్మూ  కాశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని వెంటనే పునరుద్దరించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్దమని కోర్టు అభిప్రాయపడింది.

శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం  ఈ పిటిషన్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది.  ఇంటర్నెట్ సేవల రద్దు టెలికం నియమ నిబంధనలను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది.

కాశ్మీర్‌లో ఇంటర్నెట్ రద్దును వెంటనే ఎత్తివేయాలని ఆదేశించింది. అంతేకాదు 144 సెక్షన్  అమలు చేసే విషయాన్ని కూడ సమీక్షించాలని కూడ కేంద్రాన్ని  సుప్రీంకోర్టు ఆదేశించింది. 

ప్రజల స్వేచ్చను ఎలా అడ్డుకొంటారని కూడ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎమర్జెన్సీ ఉందని  ప్రజల హక్కులకు భంగం కల్గిస్తారా అని  కూడ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 
 

click me!