సివిల్ సర్వీసులోని వివిధ కేటగిరీలలో దివ్యాంగులు ఎలా సరిపోతారు? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

Published : Nov 02, 2022, 04:31 PM ISTUpdated : Nov 02, 2022, 04:45 PM IST
సివిల్ సర్వీసులోని వివిధ కేటగిరీలలో దివ్యాంగులు ఎలా సరిపోతారు? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం

సారాంశం

వైకల్యం అనేది సానుభూతి ఒక అంశం అయితే..సివిల్ సర్వీసులోని వివిధ కేటగిరీలలో దివ్యాంగులను నియమించాలనే నిర్ణయ ఆచరణాత్మకతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని న్యాయమూర్తులు ఎస్‌ఎ నజీర్, వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

సివిల్ సర్వీసులోని వివిధ కేటగిరీలలో దివ్యాంగులకు అవకాశం కల్పించే అంశంపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు దాఖాలైన వ్యాజ్యాన్ని బుధవారం సుప్రీం కోర్టు విచారించింది. సివిల్ సర్వీసెస్‌లో దివ్యాంగులకు ఎలా అవకాశాలు కల్పించవచ్చో పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వాస్తవంలో ఆచరణాత్మకతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని  పేర్కొంది. వైకల్యం పట్ల సానుభూతి ఒక అంశం అయితే.. వికలాంగులకు నియమాకాల్లో అవకాశాన్ని కల్పించడంపై ఆచరణాత్మకతను కూడా గుర్తుంచుకోవాలని న్యాయమూర్తులు ఎస్‌ఎ నజీర్, వి రామసుబ్రమణ్యంలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వికలాంగులు అన్ని కేటగిరీల్లో సరిపోరని కోర్టు పేర్కొంది. అందుకే ఫీల్డ్ లో ఆచరణాత్మక ఆంశం కూడా పరిగణనలోకి తీసుకుని విచారణ జరపాలని కేంద్రాన్ని కోరింది.

ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఓ ఘటనను ప్రస్తావించింది. చెన్నైలో 100 శాతం అంధత్వం ఉన్న వ్యక్తిని సివిల్ జడ్జి జూనియర్ డివిజన్‌గా నియమించిన ఘటనను  పంచుకుంది . కోర్టు వ్యాఖ్యాతలు అతనిచే సంతకం చేయబడిన అన్ని ఉత్తర్వులను పొందారు మరియు తరువాత ఒక తమిళ పత్రికకు ఎడిటర్‌గా పోస్ట్ చేశారు. కావున ఈ విషయాన్ని దయచేసి పరిశీలించాలని,అన్ని వర్గాలకు వికలాంగులు సరిపోకపోవచ్చని, ఈ అంశంలో సానుభూతి కోణం, మరోకటి ఆచరణాత్మకత కోణం దాగి ఉండని బెంచ్ పేర్కొంది.  

ఎనిమిది వారాల తర్వాత విచారణ 

తొలుత కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకట్రమణి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. ఈ సమయంలోకేంద్రం కోర్టు నుండి సమయం కావాలని కోరారు.
ఎనిమిది వారాల తర్వాత దీనిపై విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS),ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ (IRPFS), ఢిల్లీ, డామన్ మరియు డయ్యూ, దాదర్ మరియు నగర్ హవేలీ, అండమాన్ మరియు నికోబార్ దీవులు, లక్షద్వీప్ పోలీస్ సర్వీస్ (DANIPS)ల్లో వారి ప్రాధాన్యత ప్రకారం దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని మార్చి 25న సుప్రీం కోర్టు అనుమతించింది. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu