
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. తన గర్ల్ ఫ్రెండ్ ముందు తిట్టిందని, వారిద్దరినీ ఉద్యోగంలో నుంచి తొలగించారని ఆ దుండగుడు ఏకంగా ఓనర్ కుటుంబాన్నే హతమార్చాడు. తూర్పు ఢిల్లీలోని అశోక్ నగర్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
అశోక్ నగర్‌లో మూడు అంతస్తుల ఇంటిలో శాలు ఆహుజా కుటుంబం నివాసం ఉంటున్నది. ఆమె వారి బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఓ బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆమె ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. వారిద్దరూ అన్‌ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేశారని ఆరోపించారు. వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఆమెకు తెలిసింది. దీంతో వారిద్దరినీ నిలదీశారు. ఈ గొడవలో ఆమె భర్త సమీర్ ఆహుజా కూడా జోక్యం చేసుకుని ఇద్దరిపై సీరియస్ అయ్యారు.
దీంతో ఆ యువకుడు అసంతృప్తి చెందాడు. తన గర్ల్ ఫ్రెండ్ ముందే నిలదీయడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అందుకే ఆహుజా కుటుంబాన్నే అంతమొందించాలని ప్లాన్ వేసుకున్నాడు. అదే విషయాన్ని గర్ల్‌ఫ్రెండ్‌తోనూ చెప్పాడు. తన ఫ్రెండ్స్ ఇద్దరు సచిన్, సుజిత్‌లనూ అందులో భాగం చేశాడు. మరో ఇద్దరిని కూడా తన ప్లాన్‌లోకి దింపాడు.
Also Read: రెండేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, అత్యాచారం.. బాలిక పరిస్థితి విషమం...
మంగళవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఐదుగురు రెండు బైక్‌లపై అహుజా ఇంటికి వచ్చినట్టు సీసీటీవీ కెమెరాలో చిక్కింది.వారంతా శాలు ఆహుజా ఇంటిలోకి చొరబడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్టుగా అంతమొందించారు. శాలు ఆహుజా, సమీర్ ఆహజులను చంపేశారు. వారి ఇంటిలో పని చేసే సప్నను కూడా చంపేశారు.
శాలు ఆహుజా మృతదేహం గ్రౌండ్ ఫ్లోర్‌లో లభించింది. సప్న డెడ్ బాడీ కూడా గ్రౌండ్ ఫ్లోర్‌లోనే లభ్యమైంది. కాగా, సమీర్ ఆహుజా మృతదేహం మాత్రం ఫస్ట్ ఫ్లోర్‌లో లభించింది. ఆయన ముఖం, తలకు తీవ్ర గాయాలు కనిపించాయి. ఫ్రైయింగ్ ప్యాన్‌తో సమీర్ ఆహుజా తలపై బలంగా దాడి చేసినట్టు తెలిసింది.
కాగా, అదే ఇంటిలో వారి కూతురు ఉన్నది. కానీ, ఆమె బ్లాంకెట్ కింద ఉండటం మూలంగా హంతకులకు కనిపించలేదు. దీంతో వారు ఆ చిన్నారిని చంపేయలేదని అధికారులు తెలిపారు.
ఆ ఇద్దరు మహిళల గొంతు కోశారు. సమీర్ ఆహుజా తలను ఫ్రైయింగ్ ప్యాన్‌తో దాడి చేసినట్టు వివరించారు. ఆ సమయంలో ఇంటి పని మనిషి సప్న కూడా ఉండటం మూలంగా చంపేసినట్టు పోలీసులు తెలిపారు. సమీర్, సుజీత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితులు ఆ ఇద్దరు అమ్మాయి, అబ్బాయి సహా నలుగురు నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.