యధాతథంగా ఎస్సీ, ఎస్టీ చట్టసవరణ బిల్లు: స్టేకు సుప్రీం నో

By sivanagaprasad kodatiFirst Published Jan 24, 2019, 6:05 PM IST
Highlights

ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారిని వేధించిన కేసులో నిందితుడికి బెయిల్ లభించకుండా కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని న్యాయస్థానం స్టేకు నిరాకరించింది. 

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలో తీసుకొచ్చిన సవరణలపై కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన సవరణలపై  స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారిని వేధించిన కేసులో నిందితుడికి బెయిల్ లభించకుండా కేంద్రం తీసుకొచ్చిన చట్ట సవరణను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని న్యాయస్థానం స్టేకు నిరాకరించింది.

అలాగే గతేడాది సుప్రీం ఇచ్చిన తీర్పుపై కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను, సవరణలను సవాల్ చస్తూ దాఖలైన ఇతర వ్యాజ్యాలపై ఒకేసారి విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది. ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి పరిశీలనకు పంపింది.

గతేడాది ఎస్సీ, ఎస్టీ చట్టంపై తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో జస్టిస్ లలిత్ భాగమైనందున ఆయన్ను కొత్తగా ధర్మాసనంలో భాగం చేయాలని కోరింది. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని కొందరు వ్యక్తులు స్వార్ధానికి వినియోగించుకుంటూ, ప్రభుత్వోద్యోగులను వేధిస్తున్నారని.. అందువల్ల ఈ చట్టం కింద కేసు నమోదు చేయగానే వెంటనే అరెస్ట్‌లు చేయరాదంటూ గతేడాది మార్చి 20న సుప్రీం సంచలన తీర్పును వెలువరించింది.

నిందితులను వెంటనే అరెస్ట్ చేయకుండా పోలీసులు ముందు విచారించాలని, అలాగే ముందస్తు బెయిల్‌ కూడా ఇవ్వాలని ఉత్తర్వుల్లో తెలిపింది. దీనిపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దాంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యథావిధిగా ఉంచుతూ కేంద్రప్రభుత్వం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టి, ఏకగ్రీవంగా ఆమోదింపజేసింది. 


 

click me!