నేషనల్ ఎమర్జెన్సీని తలపిస్తోంది: ఆక్సిజన్ కొరతపై కేంద్రానికి సుప్రీం చురకలు

By narsimha lodeFirst Published Apr 22, 2021, 1:06 PM IST
Highlights

 దేశంలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు  గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. 

న్యూఢిల్లీ: దేశంలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు  గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. దేశంలోని పలు హైకోర్టుల్లో కరోనా కేసులపై సాగుతున్న విచారణతో పాటు ఆక్సిజన్ కొరతలను సుమోటోగా సుప్రీంకోర్టు స్వీకరించింది.  దేశంలో కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ వివరాలతో పాటు కరోనా సంసిద్దతపై జాతీయ ప్లాన్ ను సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

also read:ఎల్లుండి నుండి వ్యాక్సినేషన్‌కి రిజిస్ట్రేషన్: 18 ఏళ్లు దాటిన వారంతా అర్హులే

కరోనా మందుల కొరతపై  కూడ వివరాలు అందించాలని  సుప్రీంకోర్టు ఆదేశించింది.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకొన్నారని  కోర్టు ప్రశ్నించింది. కరోనాతో దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.దేశంలో పరిస్థితులను చూస్తే నేషనల్ ఎమర్జెన్సీని తలపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో చోద్యం చూడడం సరైందికాదని కేంద్రానికి ,సూచించింది.కరోనా విషయమై  ప్రభుత్వం తీసుకొన్న ప్లాన్  ఏమిటని సుప్రీం ప్రశ్నించింది. అంతేకాదు  ఈ విషయమై  రేపటి లోపుగా నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది ఉన్నత న్యాయస్థానం

click me!