Maharashtra Assembly: "అది రాజ్యాంగ విరుద్ధం" బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సుప్రీం సంచలన తీర్పు

By Rajesh KFirst Published Jan 28, 2022, 11:36 AM IST
Highlights

Maharashtra Assembly: మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది.  అసెంబ్లీలో అస‌భ్య‌క‌రంగా ప్రవర్తించారనే ఆరోపణలపై12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను నిరవధికంగా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 
 

Maharashtra Assembly: మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది.  అసెంబ్లీలో అస‌భ్య‌క‌రంగా ప్రవర్తించారనే ఆరోపణలపై12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను నిరవధికంగా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. 
 
సెషన్‌కు మించి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే తీర్మానం “రాజ్యాంగ విరుద్ధం”, “చట్టవిరుద్ధం” మరియు “అసెంబ్లీ అధికారాలకు మించినది” అని కోర్టు పేర్కొంది. అటువంటి సస్పెన్షన్ కొనసాగుతున్న సెషన్‌కు మాత్రమే పరిమితం చేయాలని ఆదేశించింది. మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలైన జులైలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.మహారాష్ట్ర అసెంబ్లీలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వికృతంగా ప్రవర్తించినందున వారిని సంవత్సరం పాటు స్పీకర్ ఇన్ ఛైర్ భాస్కర్ జాదవ్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం జరిగిన వర్షాకాల సమావేశానికి (జూలై 2) మాత్రమే సస్పెన్షన్ విధించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

జూలై 2021లో, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఇన్-చైర్ భాస్కర్ జాదవ్ పై 12 మంది బిజెపి ఎమ్మెల్యేలు సభలో గందరగోళంగా ప్రవర్తించినందుకు, వారిని ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు.సస్పెండ్ అయిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో సంజయ్ కుటే, ఆశిష్ షెలార్, అభిమన్యు పవార్, గిరీష్ మహాజన్, అతుల్ భత్కల్కర్, పరాగ్ అలవ్ని, హరీష్ పింపాలే, రామ్ సత్పుటే, విజయ్ కుమార్ రావల్, యోగేష్ సాగర్, నారాయణ్ కుచే, కీర్తికుమార్ బంగ్డియా లు ఉన్నారు.

సభ వాయిదా పడగానే బీజేపీ ఎమ్మెల్యేలు తన క్యాబిన్‌ వద్దకు వ‌చ్చి ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌, బీజేపీ సీనియర్‌ నేత చంద్రకాంత్‌ పాటిల్‌ ఎదుట తనను దుర్భాషలాడారని స్పీకర్‌ జాదవ్‌ వివరించారు.

click me!