యుద్ధం వద్దు: సేనోటువార్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం

By Nagaraju penumalaFirst Published Feb 28, 2019, 7:46 AM IST
Highlights

ఒకసారి యుద్ధమంటూ మొదలైతే అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. యుద్ధం మొదలైతే అది తన చేతుల్లో గానీ, భారత ప్రధాని మోదీ చేతుల్లో గానీ ఉండదని స్పష్టం చేశారు. 

ఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి ప్రతిగా భారత్ నిర్వహించిన ఎయిర్‌ స్ట్రైక్స్‌, మిగ్ 21న విమానం కూల్చివేత వంటి పరిణామాల నేపథ్యంలో భారత్  పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు  కమ్ముకునేలా చేశాయి. ప్రస్తుతం భారత్, పాక్‌ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. 

భారత్ పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏ క్షణం అయినా యుద్ధం వస్తుందోనని ఇరుదేశాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశాల్లో ఎక్కడ యుద్ధం వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

ఇప్పటికే భారత్, పాకిస్థానల్ ల మధ్య భీకర పోరు జరుగుతున్న నేపథ్యంలో వివిధ దేశాలు యుద్ధం వద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేపట్టాయి.సేనోటువార్ అనే హ్యాష్ ట్యాగ్ తో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో సేనోటువార్ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 

ఒకసారి యుద్ధమంటూ మొదలైతే అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. యుద్ధం మొదలైతే అది తన చేతుల్లో గానీ, భారత ప్రధాని మోదీ చేతుల్లో గానీ ఉండదని స్పష్టం చేశారు. 

అలాగే ఇరు దేశాల ప్రతినిధులు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులపై ప్రకటనలు చెయ్యడం ఇరుదేశాల ప్రజల్లో అలజడి రేపుతోంది. సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు ట్విట్టర్ వేదికగా యుద్ధం వద్దంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 

click me!