పాక్‌లో సర్జికల్ స్ట్రైక్2...ఇండియాలో 'మిరాజ్'సింగ్ జననం

By Arun Kumar PFirst Published Feb 27, 2019, 6:14 PM IST
Highlights

జమ్ము కశ్మీర్ పుల్వామాలో మన సైనికులను పొట్టనబెట్టుకున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున పీవోకే తో పాటు పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ భారత వాయుసేన యుద్ద విమానాలు ఉగ్ర స్థావరాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 

ఇలా భారత సైన్యం అమరవీరులపై జరిగిన పైశాచిక దాడికి ప్రతీకారంగా ఎదురుదాడికి దిగడంతో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచుకుంటూ, నృత్యాలు చేస్తూ, జై హింద్ నినాదాలతో హోరెత్తిస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ దేశభక్తిని వ్యక్తపరుస్తుండగా రాజస్థాన్ కు చెందిన ఓ దంపతులు వెరైటీగా, చిరకాలం ఈ సర్జికల్ స్ట్రైక్స్ గుర్తుండిపోయే విధంగా దేశభక్తిని చాటుకున్నారు. 

రాజస్థాన్ లోని జయపుర ప్రాంతానికి చెందిన మహవీర్, సోనమ్ భార్యాభర్తలు. నిండు గర్భవతిగా వున్న సోనమ్ కు గత సోమవారం అర్థరాత్రి పురిటినొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే మంగళవారం తెల్లవారుజామున ఆమె ఓ పండంటి మడగబిడ్డకు జన్మనిచ్చింది. అదే సమయంలో భారత వాయుసేన కు చెందిన మిరాజ్-2000 యుద్ద విమానాలు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. 

కుటుంబంలో పలువురు భారత ఆర్మీలో పనిచేస్తుండటమే కాదు స్వతహాగా మహవీర్ దంపతులు మంచి దేశభక్తులు. దీంతో వీరు ఉగ్రవాదులకు, పాకిస్థాన్ కవ్వింపులకు ఒకే సారి సమాధానమిచ్చిన సంఘటనను చిరకాలం గుర్తుండేలా చేయాలనుకున్నారు. అందుకోసం పాక్ పై విరుచుకుపడి మన దేశ పౌరుషాన్ని చాటిని యుద్ద విమానం మిరాజ్-2000 యుద్ద విమానం పేరునే తమ చిన్నారికి పెట్టారు. ఇలా ఒకేసారి మిరాజ్-2000 విమానాలు పాక్ కు బుద్ది చెబుతున్న సమయంలోనే చిన్నారి ''మిరాజ్'' సింగ్  జన్మించాడన్నమాట. 

click me!