బాలికలపై సర్పంచ్ లైంగిక వేధింపులు, వ్యతిరేకించిందని ముక్కు కోసి..

Published : Mar 21, 2022, 11:30 AM IST
బాలికలపై సర్పంచ్ లైంగిక వేధింపులు, వ్యతిరేకించిందని ముక్కు కోసి..

సారాంశం

బీహార్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ సర్పంచ్ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వ్యతిరేకించిన ఓ బాలిక ముక్కు కోశాడు. 

బీహార్ : Biharలో దారుణం జరిగింది. అధికార మదమెక్కిన ఓ 
Sarpanch నీచానికి దిగజారాడు. గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లపై Sexual harassmentకు పాల్పడ్డాడు. అంతేకాదు దీన్ని వ్యతిరేకించిందని ఆ ముగ్గురిలో ఓ అమ్మాయి noiseను పదునైన ఆయుధంతో కోసేశాడు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఆ గ్రామ సర్పంచ్ ముస్తాకిన్ తన సొంత గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వేదింపులకు వ్యతిరేకంగా ముగ్గురిలోని ఓ బాలిక నిరసన వ్యక్తం చేయడంతో, కోపంతో రగిలిపోయిన సర్పంచ్ పదునైన ఆయుధంతో ఆమె ముక్కును కోసాడు. తీవ్ర రక్తస్రావం జరుగుతుండడంతో గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు సర్పంచ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా, మరోవైపు సర్పంచ్ కూడా పోలీస్ స్టేషన్ లో బాలికల తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశాడు. తనపై, తన మద్దతుదారులపై బాలికల కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపిస్తూ సర్పంచ్ పోలీస్ స్టేషన్‌ లో కంప్టైంట్ ఇచ్చాడు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, మానవత్వం మంటగలిసింది. ఓ కర్కశ తండ్రి కన్నకూతుర్లపైనే Sexual assaultకి ప్రయత్నించాడు. వనస్థలిపురం పరిధిలో ఆలస్యంగా ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… Nalgonda District దేవరకొండలోని ఓ తండాకు చెందిన వ్యక్తి భార్య, ఐదుగురు సంతానం. వారిలో 20, 13,  పదకొండేళ్ల కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వనస్థలిపురం ఓ కాలనీలో వీరు ఉంటున్నారు. అతను ఆటో డ్రైవర్. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడి కన్ను ఎదిగిన కుమార్తెలపై పడింది. నిత్యం liquor తాగి వచ్చి వారిని లైంగికంగా వేధించసాగాడు. అతడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు wife ప్రతిఘటించేది.  

అయితే, ఈనెల 17న ఆమెను కొట్టి ఇంటి నుంచి వేరే గ్రామానికి పంపించాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి మొదట తన 13 ఏళ్ల కుమార్తె లైంగిక దాడికి ప్రయత్నించాడు. మిగతా కుమార్తెలు అరవడంతో భయపడిన అతడు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్క చెల్లెలు అక్కడినుంచి తప్పించుకుని షీ టీమ్ కు, పోలీసులకు ఫోన్ చేశారు. రెండు గంటలైనా స్పందన లేకపోవడంతో తమను పోలీసులు రక్షించలేరని భావించి.. ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న మహిళా వారిని చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థ ఫోన్ నెంబర్ ఇచ్చింది.

ఆ ముగ్గురూ ఆ సంస్థ ప్రతినిధికి ఫోన్ చేసి వివరాలు తెలిపారు. సదరు ప్రతినిధి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఠాణాకు తీసుకువెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు . వారి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.  కుమార్తెల పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి రిమాండ్కు తరలించారు. 

PREV
click me!

Recommended Stories

PM Narendra Modi: మసాలా చాట్ టేస్ట్ చేసి పిల్లలకు పంచిన ప్రధాని మోదీ| Asianet News Telugu
Akshaya Tritiya Gold buying: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం గ్రాము ఎంతో తెలుసా?| Asianet News Telugu