ప్రేమించి పెళ్లికి నో: భీవండీలో యువతి ఆత్మహత్య

Published : Dec 20, 2019, 12:03 PM ISTUpdated : Dec 20, 2019, 12:16 PM IST
ప్రేమించి పెళ్లికి నో: భీవండీలో యువతి ఆత్మహత్య

సారాంశం

భీవండీలో తెలుగు యువతి ఆత్మహత్య చేసుకొంది. ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో ఆమె ఆత్మహత్య చేసుకొందని  కుటుంబసభ్యులు చెబుతున్నారు. 

ముంబై:ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో  మనోవేదనకు గురైన తెలుగు యువతి మహారాష్ట్రలోని భీవండిలో ఆత్మహత్యకు పాల్పడింది. మహారాష్ట్రలోని భీవండిలో కామత్‌ఘర్‌కు చెందిన 21 ఏళ్ల స్వాతి వేముల, బాలాజీ నగర్‌కు చెందిన సాయిచంద్ర మాచర్ల గత నాలుగేళ్లుగా ప్రేమించుకొంటున్నారు.

అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకొందామని స్వాతి చెప్పడంతో  సాయిచంద్ర నిరాకరించాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వాతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. స్వాతి ఆ్మహత్యకు కారణమైన సాయిచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయిచంద్ర మాచర్ల ఎందుకు స్వాతిని పెళ్లి ఎందుకు చేసుకోనేందుకు నిరాకరించారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు