UP Elections 2022: సీఎం యోగిపై ఎన్నికల బరిలో బ్రాహ్మణ అభ్యర్థి!

By Rajesh KFirst Published Jan 21, 2022, 5:46 PM IST
Highlights

UP Elections 2022:  ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ బ్రాహ్మణ అభ్యర్థిని నిలబెట్టాల‌ని భావిస్తున్నాయి. రాబోయే యూపీ ఎన్నికలలో  గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
 

UP Elections 2022: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. పోలింగ్ తేదీ స‌మీపిస్తున్న‌ కొద్దీ..  పొలిటికల్ డ్రామా మ‌రింత ర‌క్తి కడుతోంది. ఈ త‌రుణంలో వివిధ పార్టీల నేతలు ఫిరాయింపుల పర్వానికి తెరలేపారు. వివిధ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తున్న దృష్ట్యా పలు పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు టికెట్ల కోసం పార్టీలు మారుతున్నారు.

ఈ త‌రుణంలో సమాజ్‌వాదీ పార్టీ కీలక నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. బీజేపీ అడ్డా అయిన‌.. యోగి ఆదిత్యనాథ్‌ సొంత గడ్డ గోరఖ్‌పూర్ అర్బన్ స్థానంలో యోగి ఆదిత్యనాథ్‌పై సమాజ్‌వాదీ పార్టీ బ్రాహ్మణ అభ్యర్థిని నిలబెడుతుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో తన సొంత గడ్డ అయిన గోరఖ్‌పూర్ అర్బన్ స్థానం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
 
యూపీలో యోగి హయాంలో బ్రాహ్మణులు కలత చెందారనీ, దీంతో యోగిపై బ్రాహ్మణ అభ్యర్థిని ఎన్నికల బరిలోకి దించడం ద్వారా ఓట్లు పొందాలని అఖిలేష్ యాదవ్ రాజకీయ ఎత్తుగడ వేశారు. ఇప్పటికే యోగిపై భీంఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ పోటీ చేస్తానని ప్రకటించారు.

సమాజ్‌వాదీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం..  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న దివంగత ఉపేంద్ర దత్ శుక్లా భార్య సుభావతి శుక్లా, సిఎం యోగిపై పోరాడే అవకాశం ఉంది, ఆమె బ్రాహ్మణ అభ్యర్థిని. గురువారం సాయంత్రం సుభావతి తన ఇద్దరు కుమారులతో కలిసి ఎస్పీ వద్ద చేరడం గమనార్హం. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత్ర మీడియా సమావేశంలో యోగికి వ్యతిరేకంగా సుభావతి అభ్యర్థిత్వం గురించి కూడా సూచించారు. 
 
గోరఖ్ పూర్ సీటు కు పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, అయితే ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నిల‌బెట్ట‌డానికి ప్ర‌యత్నిస్తున్న‌మ‌ని అఖిలేష్ యాదవ్ అన్నారు. ఠాకూర్ ఫైర్‌బ్రాండ్ బిజెపి నేతపై బ్రాహ్మణ ముఖాన్ని ఎస్‌పి రంగంలోకి దింపడం వల్ల అఖిలేష్ యాదవ్‌కు బ్రాహ్మణ ఓట్లు వచ్చే అవకాశం ఉందని  రాజ‌కీయ విశ్లేకులు పేర్కొన్నారు.

బీజేపీకి చెందిన రాధా మోహన్ దాస్ అగర్వాల్ ప్రస్తుతం ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గోరఖ్ పూర్ అసెంబ్లీ స్థానం నుంచి రాధా మోహన్ దాస్ నాలుగుసార్లు గెలిచారు. గోరఖ్‌పూర్ అర్బన్ సీటుకు మార్చి 3న ఆరో దశలో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లో 160 అసెంబ్లీ స్థానాలను ఉన్నాయి. 2017లో 160 స్థానాల్లో బీజేపీ 115, సమాజ్‌వాదీ పార్టీ 17, బహుజన్ సమాజ్ పార్టీ 14, కాంగ్రెస్ 2, ఇతర పార్టీలు/స్వతంత్రులు 12 గెలుచుకున్నారు.

click me!