
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (uttar pradesh assembly elections) పోలింగ్ ముగిసిన మరుసటి రోజే సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party) అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమీషన్‌ను (election commission) తాము నమ్మడం లేదని.. ఈవీఎంలను ట్యాంపరింగ్ (evm tampering ) చేశారని అఖిలేష్ ఆరోపించారు. కౌంటింగ్‌కు ముందే ఈవీఎంలను మార్చారని .. ఎన్నికల కమీషన్ అధికారులే ఈవీఎంలను మార్చేశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్‌కు ముందే ఈవీఎంలను తరలిస్తున్నారని అఖిలేష్ ఆరోపించారు.
కాగా.. యూపీ (Up)లో అసెంబ్లీ ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. దీంతో దాదాపు రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దాదాపు ఏడు విడతలుగా చేపట్టిన ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు యూపీలో ఎవరు గెలుస్తారనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే సోమవారం సాయంత్రం పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (exit polls) ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ (bjp)యే మళ్లీ అధికారం చేపట్టే అవకాశం ఉందని తెలిపాయి. బీజేపీ మొదటి స్థానంలో, సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party) రెండో స్థానంలో, బీఎస్పీ (bsp) మూడో స్థానంలో, కాంగ్రెస్ (congress) నాలుగో స్థానంలో నిలుస్తాయని చెప్పాయి.
మరోవైపు.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉన్నాయి. యూపీలో అధికారం చేపట్టాలంటే దాదాపు 202 స్థానాలు అవసరం ఉంటుంది. అయితే బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిపి ఈ మెజారిటీ సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. News18-P MARQ ఎగ్జిట్ పోల్ ప్రకారం BJP దాని మిత్రపక్షాలకు 240 సీట్లు, సమాజ్‌వాదీ దాని మిత్రపక్షాలకు 140 సీట్లు, BSP 17 సీట్లు, కాంగ్రెస్‌కు 4 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
NewsX-Polstrat ఎగ్జిట్ పోల్ ప్రకారం BJP 211-225 సీట్లు, SP-RLD కూటమి 146-160 సీట్లు, BSP 14-24 సీట్లు, కాంగ్రెస్ నాలుగు నుండి 6 సీట్లు గెలుచుకుంటాయని తెలిపాయి. టైమ్స్ నౌ-వీటో ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 225 సీట్లు, ఎస్పీ-ఆర్‌ఎల్‌డీకి 151 సీట్లు, బీఎస్పీకి 14, కాంగ్రెస్‌కు 9 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇండియా న్యూస్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 222-260 సీట్లు, ఎస్పీ 135-165 సీట్లు, బీఎస్పీ 4 నుంచి 9 సీట్లు, కాంగ్రెస్ ఒకటి నుంచి మూడు సీట్లు గెలుచుకోవచ్చు.
దీంతో పాటు టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 294 సీట్లు, ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమికి 105 స్థానాలు, బీఎస్పీకి రెండు సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు ఒక సీటు, ఇతరులకు ఒక సీటు దక్కే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అన్ని సర్వేలు కాంగ్రెస్ చివరి స్థానంలో నిలుస్తాయని చెప్పాయి. ప్రస్తుతం బీజేపీ అధికార పార్టీగా ఉండగా.. సమాజ్ వాదీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది.