
ముంబయి: పంజాబ్ పోలీసులు ఆదివారం సంచలన విషయాన్ని వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన ప్రముఖ సింగ్ సిద్ధూ మూసేవాలా హంతకుల విచారణలో తమకు ఆందోళనకర నిజం తెలిసిందని వివరించారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులు.. బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ టార్గెట్‌గా రెక్కీ చేసినట్టు వివరించారని పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ బిష్ణోయ్ లారెన్స్ గ్రూప్ పని చేసినట్టూ తేలిందని వివరించారు.
నేపాల్ పోలీసులు శనివారం దీపక్ ముండీ, ఆయన ఇద్దరు సహచరులు కపిల్ పండిట్, రాజిందర్‌లను పశ్చిమ బెంగాల్, నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సిద్దూ మూసేవాలా హత్య కేసులో దీపక్ ముండీ చివరి నిందితుడు. ఈ ముగ్గురినీ ఏడు రోజుల కస్టడీకి పంపిస్తూ మాన్సా కోర్టు ఆదేశించింది.
సల్మాన్ ఖాన్‌పై దాడి చేయడానికి జరిగిన రెక్కీలో కంపిల్ పండిత్ పాల్గొన్నాడు. సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ దాడి చేయాలని భావించాడని, అందుకోసం కపిల్ పండిట్ రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు వివరించారు. కపిల్ పండిట్‌తోపాటు సంతోష్ యాదవ్, సచిన్ బిష్ణోయ్‌లు కూడా ఈ రెక్కీలో పాల్గొన్నట్టు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ వెల్లడించారు. సల్మాన్ ఖాన్‌పై దాడి చేయడానికి సంపత్ నెహ్రాతో కలిసి ఓ ప్లాన్ వేసినట్టూ తెలిసిందని వివరించారు.
ఈ ఏడాది జూన్‌లో సల్మాన్ ఖాన్, ఆయన తండ్రి సలీం ఖాన్‌లను బెదిరిస్తూ ఓ లేఖ వచ్చిన సంగతి తెలిసిందే. మిమ్మల్ని కూడా మూసేవాలా చేసేస్తాం (సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే పడుతుంది!) అని రాసి ఉన్న ఓ సంతకం లేని లేఖ సల్మాన్ ఖాన్, సలీం ఖాన్‌లను సూచిస్తూ ముంబయిలోని బాంద్రా బాండ్‌స్టాండ్ ప్రొమెనేడ్‌లో దొరికింది.
అంతేకాదు, సల్మాన్ ఖాన్ తరఫు వాదిస్తున్న న్యాయవాది హస్తిమల్ సారస్వత్ కూడా బెదిరింపు లేఖను ఎదుర్కొన్నాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఇదే తరహాలో ఆయన చాంబర్ బయట లేఖ కనిపించింది. మూసేవాలాకు పట్టిన గతే నీకూ పడుతుంది అని ఆ లేఖలో ఉన్నది.
సిద్దూ మూసేవాలా హత్య కేసులో నిందితుడిగా ఉన్న లారెన్స్ బిష్ణోయ్ కూడా 2018లో సల్మాన్ ఖాన్‌ను చంపేయాలని ప్లాన్ వేసినట్టు వెల్లడించాడు. 1998లో కృష్ణ జింక వేటకు సంబంధించిన కేసుకు ప్రతీకారంగా ఈ పని చేయాలని అనుకున్నట్టు వివరించారు. అప్పుడు ఓ ఇద్దరు అనుచరులను ముంబయికి పంపించానని, సల్మాన్ ఇంటిని రెక్కీ చేసి.. సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలని ఆదేశించానని తెలిపారు.