66 శాతం పెరిగిన ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం.. కేజ్రీవాల్ వేతనం ఎంతో తెలుసా..?

Published : Mar 13, 2023, 05:46 PM ISTUpdated : Mar 13, 2023, 05:47 PM IST
66 శాతం పెరిగిన ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం.. కేజ్రీవాల్ వేతనం ఎంతో తెలుసా..?

సారాంశం

New Delhi: ఢిల్లీ ఎమ్మెల్యేల జీతం, ఇత‌ర అలవెన్సులు 66 శాతం పెరిగాయి. తాజా ఉత్త‌ర్వుల ప్రకారం మొత్తం నెలవారీగా రూ. 54,000 గా ఉన్న జీతం ఇప్పుడు రూ. 90,000 పెరిగింది. ఈ మేర‌కు ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ ఇదివరకు తీర్మానం చేసింది.  

Delhi MLAs Get 66 Percent Hike In Salary: ఢిల్లీ శాసనసభ్యుల జీతాలు పెంచాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో వారి జీతభత్యాలు 66 శాతానికి పైగా పెరగనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్ర‌భుత్వ ఉత్వ‌ర్వుల ప్ర‌కారం.. నెలకు రూ.54వేలు జీతం తీసుకునే ఎమ్మెల్యేకు ఇప్పుడు రూ.90వేలు అందనున్నాయి.

వీరి నెలసరి మూలవేతనం రూ.12 వేల నుంచి రూ.30 వేలకు పెరిగింది. వారి నియోజకవర్గ భత్యాన్ని రూ.18 వేల నుంచి రూ.25 వేలకు, రవాణా అలవెన్స్ ను రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. టెలిఫోన్ అలవెన్స్ ను రూ.8 వేల నుంచి రూ.10 వేలకు, సచివాలయ అలవెన్స్ ను రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచారు. 

మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ప్రతిపక్ష నేత వేతనాలను రూ.72 వేల నుంచి రూ.1.70 లక్షలకు పెంచారు. వారి నెలవారీ మూలవేతనం రూ.20,000 నుంచి రూ.60,000కు పెరిగింది. వారి నియోజకవర్గ భత్యాన్ని రూ.18 వేల నుంచి రూ.30 వేలకు, సంప్ట్యూరీ అలవెన్స్ ను రూ.4 వేల నుంచి రూ.10 వేలకు, రోజువారీ అలవెన్స్ ను రూ.1,000 నుంచి రూ.1,500కు పెంచారు. వీరికి రూ.25 వేల సచివాలయ అలవెన్స్ కూడా అందనుంది.

వీటితో పాటు గతంలో రూ.50,000 ఉన్న కుటుంబ వార్షిక ప్రయాణ రీయింబర్స్ మెంట్ ల‌క్ష రూపాయ‌ల‌కు పెరిగింది. నెలకు రూ.20,000 అద్దె లేని వసతి, డ్రైవర్ తో కారును ఉచితంగా ఉపయోగించడం లేదా నెలకు రూ.10,000 రవాణా భత్యం (గతంలో ₹ 2,000),  ఉచిత వైద్య చికిత్స ఖ‌ర్చులు అంద‌నున్నాయి. దేశంలోనే అతి తక్కువ వేతనం అందుకుంటున్న ఢిల్లీ ఎమ్మెల్యేల వేతనాల పెంపునకు సంబంధించిన బిల్లులను గత ఏడాది జూలైలో అసెంబ్లీ ఆమోదించింది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, చీఫ్ విప్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వేతనాల పెంపునకు సంబంధించి ఐదు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టగా, వాటిని సభ్యులు ఆమోదించారు. ఈ బిల్లులు అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత మార్చి 9న న్యాయ, శాసనసభా వ్యవహారాల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu