సిక్కుల ఊచకోత కేసు: కాంగ్రెస్ పార్టీకి ఎంపి రాజీనామా

By Arun Kumar PFirst Published Dec 18, 2018, 2:00 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు, మాజీ ఎంపి  సజ్జన్ కుమార్‌ను సిక్కుల ఊచకోత కేసులో డిల్లీ హైకోర్టు నిందితుడిగా తేల్చింది. అతడితో పాటు మరో ముగ్గురుకి కూడా కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. అయితే ఈ కేసులో శిక్ష ఖరారవడంతో సజ్జన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 1984 లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సెక్యూరిటీ సిబ్బంది అత్యంత దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా సిక్కులపై కొందరు నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డాడు. 

ఈ అల్లర్లలో భాగంగా డిల్లీలో ఓ సిక్కు కుటుంబం దారుణ హత్యకు గురయ్యింది. అలాగే రాజ్ నగర్ ప్రాంతంలోని ఓ గురుద్వారాపై కొందరు దాడిచేసి దహనం చేశారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటి ఎంపి సజ్జన్ కుమార్ తో పాటు మరికొంత మందిపై అనుమానం తో అరెస్ట్ చేశారు. అయితే ఆయనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదంటూ కింది కోర్టు నిర్దోషిగా తేల్చి విడుదల చేసింది. 

దీంతో భాదిత కుటుంబ సభ్యులు డిల్లీ హైకోర్టుకు వెళ్లారు. అయితే అప్పటి నుండి ఈ కేసు విచారణ కొనసాగగా తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. సజ్జన్ కుమార్ కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించారు. ఈయనతో పాటు మరో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో ఇద్దరికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌, జస్టిస్‌ వినోద్‌ గోయల్‌లతో కూడిన ధర్మాసనం 207 పేజీల తీర్పును వెలువరించింది. 

ఈ కేసులో శిక్ష పడిననిందితులంతా ఈ నెల చివరి వరకు లొంగిపోవాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సజ్జన్ కుమార్ త్వరలో   లొంగిపోనున్నారు. 
  
click me!