తాగినమైకంలో.. పరాయి వ్యక్తి భార్యను నడిరోడ్డుపై..

Published : Dec 18, 2018, 12:03 PM IST
తాగినమైకంలో.. పరాయి వ్యక్తి భార్యను నడిరోడ్డుపై..

సారాంశం

పీకలదాకా మద్యం తాగిన అల్విన్.. బైక్ పై వెళ్తుండగా.. మార్గమధ్యంలో.. ఓ వివాహిత కనిపించగా.. ఆమెను హగ్ చేసుకొని అసభ్యంగా ప్రవర్తించాడు.

తాగిన మైకంలో ఓ వ్యక్తి పరాయి వ్యక్తి భార్యను నడిరోడ్డుపై  కౌగిలించుకున్నాడు.  ఆమె కేకలు పెట్టడంతో... స్థానికులు వచ్చి.. ఆమెను రక్షించారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని యలహంక పట్టణంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... యలహంక ప్రాంతానికి చెందిన అల్విన్(28) అనే యువకుడు జిమ్ నిర్వహాకుడిగా వ్యవహరిస్తున్నాడు. సోమవారం పీకలదాకా మద్యం తాగిన అల్విన్.. బైక్ పై వెళ్తుండగా.. మార్గమధ్యంలో.. ఓ వివాహిత కనిపించగా.. ఆమెను హగ్ చేసుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో.. స్థానికులు వచ్చి ఆమెను రక్షించారు.

అల్విన్ ని వెంటనే పోలీసులకు అప్పగించారు. అయితే.. తాను లిఫ్ట్ ఇస్తానంటే ఆ వివాహిత అభ్యంతరం తెలిపిందని.. అందుకే ఇలా చేశానని ఆ యువకుడు చెప్పడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !