మతాంతర వివాహం: లాలూ పరువు మంటగలిపావుగా, తేజస్వీ యాదవ్‌పై మేనమామ ఆగ్రహం

Siva Kodati |  
Published : Dec 11, 2021, 03:00 PM IST
మతాంతర వివాహం: లాలూ పరువు మంటగలిపావుగా, తేజస్వీ యాదవ్‌పై మేనమామ ఆగ్రహం

సారాంశం

ఆర్జేడీ నేత (rjd) తేజశ్వి యాదవ్ (tejashwi yadav) తన స్నేహితురాలు రేచల్ గొడిన్హోను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే తేజశ్విపై ఆయన మేనమామ సాధు యాదవ్ (sadhu yadav) మండిపడ్డారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) పరువు, ప్రతిష్ఠను ఆయన కుమారుడు తేజశ్వి మంటకలిపాడని సాధు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్జేడీ నేత (rjd) తేజశ్వి యాదవ్ (tejashwi yadav) తన స్నేహితురాలు రేచల్ గొడిన్హోను పెళ్లాడిన సంగతి తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని సైనిక్ ఫామ్ ప్రాంతంలో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తేజశ్విపై ఆయన మేనమామ సాధు యాదవ్ (sadhu yadav) మండిపడ్డారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) పరువు, ప్రతిష్ఠను ఆయన కుమారుడు తేజశ్వి మంటకలిపాడని సాధు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALso Read:లాలూ గెటప్ లో తేజ్ ప్రతాప్ యాదవ్..!

మతాంతర వివాహం చేసుకోవడం ద్వారా లాలూ ప్రతిష్ఠను తేజశ్వి దెబ్బతీశాడని సాధు యాదవ్ మండిపడ్డారు. బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నేతగా పిలిపించుకునే అర్హత తేజశ్వికి లేదని అన్నారు. పార్టీలో, కుటుంబంలో ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని సాధు యాదవ్ విమర్శించారు. దీనిని ఇకపై కొనసాగనివ్వబోమని... ఆయనకు తగిన గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ పెళ్లికి సాధు యాదవ్ ని తేజశ్వి ఆహ్వానించలేదు. ఇక,లాలూ ప్రసాద్‌, రబ్రీదేవీల 9మంది సంతానంలో తేజస్వీ యాదవ్ చివరి వ్యక్తి. ఆయనకు ఏడుగురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉండగా వారందరికీ వివాహాలు జరిగాయి.
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్