దారుణం.. సౌండ్ ఎక్కువ పెట్టాడని.. కొట్టి చంపేశాడు...

By SumaBala BukkaFirst Published Dec 11, 2021, 2:04 PM IST
Highlights

ఒక వ్యక్తి తన Music systemలో ఎక్కువ Sound పెడుతున్నాడని.. అతని పక్కింటి వ్యక్తి దాడిచేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 25 యేళ్ల నిందితుడిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణించిన వ్యక్తి మ్యూజిక్ సౌండ్ తగ్గించడానికి నిరాకరించడంతో.. గొడవ జరిగింది. చివరకు అదిConflictగా మారి ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది.  

ముంబయి : రోజురోజుకూ మనుషుల్లో సహనం నశిస్తుంది. పేషన్స్ తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపానికి వస్తున్నారు. మనం మనుషులం... విచక్షణతో ఉండాలి అన్న విషయాన్ని మరిచిపోతున్నారు. కోపం వస్తే ఎదుటివారిపై విచక్షణారహితంగా attack చేస్తున్నారు. చేతికి ఏది దొరికితే దానితో.. దాడికి  తెగబడుతున్నారు. అవతలి వ్యక్తి ప్రాణాలు తోడేస్తున్నారు. తాజాగా  అలాంటి దారుణమైన ఘటన మహారాష్ట్రలోని mumbai లో జరిగింది.

ఒక వ్యక్తి తన Music systemలో ఎక్కువ Sound పెడుతున్నాడని.. అతని పక్కింటి వ్యక్తి దాడిచేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 25 యేళ్ల నిందితుడిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరణించిన వ్యక్తి మ్యూజిక్ సౌండ్ తగ్గించడానికి నిరాకరించడంతో.. గొడవ జరిగింది. చివరకు అదిConflictగా మారి ప్రాణాలు తీసే వరకు వెళ్ళింది.  

మరణించిన వ్యక్తిని సురేందర్ గౌడ్ (47)గా గుర్తించారు. బుధవారం ముంబై మలాడ్ లోని.. మాల్వానీ కాలనీ ఏక్తా చాల్ సొసైటీ లో జరిగిన ఈ దారుణమైన murder వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు, నిందితుడు ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని సైఫ్ అలీ షేక్ (25) గా  పోలీసులు గుర్తించారు.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మరణించిన వ్యక్తి తన ఇంటి వెలుపల తన Tape recordలో పాటలు వింటున్నాడు. నిందితుడు అతనిని వాల్యూమ్ తగ్గించమని అడిగాడు. దీనికి అతను ఒప్పుకోలేదు. దీనిపై ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఘర్షణలో  బాధితుడు తలకు గాయాలై మరణించాడు. అయితే నిందితుడికి బాధితుడిని చంపాలనే ఉద్దేశ్యం లేదని.. క్షణికావేశంలో హత్య జరిగిందని పోలీసులు తెలిపారు.

బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద అభియోగాలు మోపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి.. న్యాయమూర్తి ఆదేశాల అనంతరం కస్టడీకి తరలించారు. 

ఏనుగుల గుంపును తరమబోతే.. గురి తప్పిన తూటా, తల్లి ఒడిలోని రెండేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది..

ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెలలో ఓ దారుణ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులే ఆ చిన్నారి పాలిట యమదూతలుగా మారారు. ఆడపిల్ల అనే అసహనం కన్నకడుపు తీపిని చంపేసింది. కర్కశంగా ప్రవర్తించేలా చేసింది. రెండు రోజుల పసిపాపను కన్నతల్లే అత్యంత దారుణంగా చంపేసింది.

ఆడపిల్ల పుట్టిందని బొంత లక్ష్మి అనే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో.. మళ్లీ ఆడపిల్లే పుట్టిందన కారణంగా పసికందుకు పాశవికంగా హతమార్చింది. బిడ్డను murder చేసిన తర్వాత health బాగా లేదంటూ ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. వైద్య సిబ్బంది నిలదీయడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై Medical staff పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రావడానికి ముందే రాత్రికి రాత్రే పాప Dead bodyని తల్లిదండ్రులు పూడ్చిపెట్టారు. మృతదేహాన్ని వెలికితీసి Postmortem చేయించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుమార్తెను చంపేసిన దంపతులకు గతంలోనే ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 

click me!