రాహుల్ గాంధీ జేబు ఎవరు కొట్టేశారు?: కేంద్ర మాజీ మంత్రి ప్రశ్నలు.. ‘అలాంటి వార్తలు స్ప్రెడ్ చేయద్దు’

Published : Jan 30, 2022, 12:43 PM IST
రాహుల్ గాంధీ జేబు ఎవరు కొట్టేశారు?: కేంద్ర మాజీ మంత్రి ప్రశ్నలు.. ‘అలాంటి వార్తలు స్ప్రెడ్ చేయద్దు’

సారాంశం

రాహుల్ గాంధీ బుధవారం చేసిన పంజాబ్ పర్యటనపై శిరోమణి అకాలీ దళ్ నేత, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ ప్రశ్నలు వేశారు. ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టాలని ప్రయత్నించారు. రాహుల్ గాంధీ కొందరు కాంగ్రెస్ నేతలతో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కేవలం ముగ్గురు నేతలు మాత్రమే ఆయనను కలువడానికి సెక్యూరిటీ అనుమతించిందని ఆమె పేర్కొన్నారు. అక్కడ రాహుల్ గాంధీ జేబును ఎవరు కొట్టేశారని ప్రశ్నించారు. దీనికి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల(Punajb Assembly Election) కోసం అధికారంలోని కాంగ్రెస్(Congress) పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ బలంగా ఉన్నది. వీటికితోడు శిరోమణి అకాలీ దళ్, పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీలూ జోరుగానే ప్రచారం చేస్తున్నాయి. అధికారాన్ని కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కానీ, ఆ పార్టీలోనే అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ సీఎం క్యాండిడేట్‌ను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ బుధవారం పంజాబ్ పర్యటించారు. ఈ పర్యటనను టార్గెట్ చేస్తూ శిరోమణి అకాలీ దళ్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి హర్‌‌సిమ్రత్ కౌర్(Harsimrat Kaur).. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

రాహుల్ గాంధీ తన పర్యటనలో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సందర్శించారు. పూజలు చేశారు. అదే రోజు సాయంత్రం ఆయన జలంధర్ కూడా పర్యటించారు. వర్చువల్‌ ర్యాలీని ఉద్దేశిస్తూ ప్రసంగం ఇచ్చారు. సీఎం క్యాండిడేట్‌పై కీలక ప్రకటన చేశారు. అయితే, ఈ స్వర్ణ దేవాలయాన్ని పర్యటిస్తున్నప్పుడు సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, డిప్యూటీ సీఎం సుఖ్‌జిందర్ సింగ్ రంధావా, ఓపీ సోనీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో వెళ్లారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. హర్మందిర్ సాహిబ్ ఆలయంలో రాహుల్ గాంధీ జేబు ఎవరు కొట్టేశారు? అంటూ హర్‌సిమ్రత్ కౌర్ ట్వీట్ చేశారు. చరణ్ జిత్ సింగ్ చన్నీ కొట్టేశారా? నవజోత్ సింగ్ సిద్దూ లేక డిప్యూటీ సీఎం రంధావాలే జేబు కొట్టేశారా? అంటూ అడిగారు. ఎందుకంటే.. హర్మందిర్ సాహిబ్ ఆలయ సందర్శనలోనూ రాహుల్ గాంధీని కలువడానికి జెడ్ సెక్యూరిటీ కేవలం వీరి ముగ్గురిని మాత్రమే అనుమతించిందని పేర్కొన్నారు. అంటే.. అక్కడ దొంగలు ఉన్నారని భావిస్తున్నారా? అంటూ పరోక్షంగా చురకలు వేశారు. లేక పవిత్రమైన ఆ ఆలయ ప్రతిష్టను దెబ్బ తీయడంలో భాగంగానే రాహుల్ గాంధీ ఈ పని చేశారా? అంటూ ప్రశ్నించారు. అయితే, అంతకు మించి ఆమె మరే వివరాలను వెల్లడించలేరు.

కాగా, కాంగ్రెస్ పార్టీ ఆమె ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ చీఫ్ స్పోక్స్‌పర్సన్ రణదీప్ సింగ్ సుర్జేవాలా రీట్వీట్ చేశారు. అలాంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేసే ఆ ఆలయ గౌరవాన్ని మంటగలుపుతాయని విమర్శించారు. అక్కడ అసలు ఏమీ జరగకున్నా.. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడమే తప్పు అని పేర్కొన్నారు. అంతటితో ఆగలేదు. మూడు వివాదాస్పద సాగు చట్టాలను రూపొందించడంలో భాగస్వామిగా ఉండి ఆమెనే రైతుల జేబు కొట్టేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఈ మూడు సాగు చట్టాలపై పంజాబ్‌లో తీవ్ర వ్యతిరేకత వస్తున్న సందర్భంలో ఆమె తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2020 సెప్టెంబర్‌లో ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖకు ఆమె రాజీనామా చేశారు.

పంజాబ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని రాహుల్ గాంధీ ఆ రోజు ఓ కార్యక్రమంలో వెల్లడించారు. పంజాబ్ ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం ఈ నిర్ణయం తీసుకుందామని వివరించారు. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని(CM Candidate) ఎలా నిర్ణయించుకుందాం? అని ప్రశ్నించారు. మళ్లీ ఆయనే సమాధానం ఇస్తూ.. కాంగ్రెస్ కార్యకర్తలే తమ సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తారని తెలిపారు. సీఎం అభ్యర్థిని నిర్ణయించుకోవడం వారి చేతుల్లోనే పెడుతున్నామని పేర్కొన్నారు. జలందర్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఒక పార్టీని ఇద్దరు లీడ్ చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఎవరో ఒకరే పార్టీకి నాయకత్వం వహించడం సరైన మార్గం అని తెలిపారు. ఒకరు నాయకత్వం వహిస్తే.. మరొకరు.. ఇతరులు అందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !