Coronavirus: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వైరస్ కట్టడి చర్యలను వేగవంతం చేసింది సర్కారు. దీనిలో భాగంగా ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇప్పటివరకే దేశంలోని 75 శాతం మంది వయోజనులకు రెండు డోసుల టీకాలు అందించడంతో.. ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Coronavirus: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ (Coronavirus) కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ తో పాటు అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ కేసులు సైతం భారత్ లో వెగులుచూడటంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. దనికి తోడు ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా (Coronavirus) థర్డ్ వేవ్ లో మరణాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వైరస్ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా కరోనా వ్యాక్సినేషన్ తో పాటు కోవిడ్-19 (Coronavirus) పరీక్షలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
కరోనా వైరస్ (Coronavirus) నియంత్రణ చర్యల్లో భాగంగా ఇప్పటివరకు దేశంలోని వయోజన జనాభాలో 75 శాతం మందికి పూర్తిగా టీకాలు వేశారు. ఈ విషయంపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. దేశ పౌరులకు అభినందనలు తెలిపారు. "మొత్తం వయోజనులలో 75 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఈ మహత్తరమైన ఫీట్ సాధించడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన మా తోటి పౌరులకు అభినందనలు. టీకా డ్రైవ్‌ను విజయవంతం చేస్తున్న వారందరిని చూస్తుంటే గర్వంగా ఉంది" అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
75% of all adults are fully vaccinated.
Congratulations to our fellow citizens for this momentous feat.
Proud of all those who are making our vaccination drive a success. https://t.co/OeCJddtAL8
undefined
దేశంలోని వయోజన జనాభాలో 75 శాతానికి పైగా ఇప్పుడు కోవిడ్-19కి పూర్తిగా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఆదివారం నాడు వెల్లడించారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని మోడీ టీకా కార్యక్రమంలో పాలుపంచుకున్న వారికి అభినందనలు తెలిపారు.
"సబ్కా సాథ్, సబ్కా ప్రయాస్' అనే మంత్రంతో, భారతదేశం తన వయోజన జనాభాలో 75 శాతం మందికి వ్యాక్సిన్ రెండు డోసులతో టీకాలు వేసింది. కరోనాపై పోరాటంలో మేము మరింత బలపడుతున్నాము. మేము అన్ని నియమాలను పాటించాలి.. అలాగే, నిర్వహించాలి. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ అందరికీ వేయండి’’ అని మంత్రి ట్వీట్ చేశారు.
ఇప్పటివరకు దేశంలో 165.70 కోట్ల (Coronavirus) వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు. ఇందులో మొదటి డోసు తీసుకున్న వారు 89.3 కోట్ల మంది ఉండగా, రెండు డోసులు తీసుకున్నవారి సంఖ్య 70.6 కోట్లకు పెరిగింది. అలాగే, గత 24 గంటల్లో దేశంలో 16,15,993 కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. మొత్తంగా ఇప్పటివరకు 72.93 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొంది.
'सबका साथ, सबका प्रयास' के मंत्र के साथ, भारत ने अपनी 75% वयस्क आबादी को वैक्सीन की दोनों डोज लगाने का लक्ष्य हासिल कर लिया है।
कोरोना से लड़ाई में हम निरंतर मज़बूत हो रहें है। हमें सभी नियमों का पालन करते रहना है और जल्द से जल्द वैक्सीन लगवानी है। pic.twitter.com/wSBg9AQphx