
ICC T20 ప్రపంచ కప్ 2022లో భాగంగా.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. అత్యంత ఉత్కఠభరితమైన,సూపర్ హై వోల్టేజ్ మ్యాచ్‌లో రన్ మెషిన్ విరాట్ కోహ్లి చెలరేగడంతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ 53 బంతుల్లో 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.
విరాట్ కోహ్లి ఆట తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఆయనను ఎంతగానో కీర్తిస్తున్నారు. తాజా అత్యుత్తమ ప్రదర్శనపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. విరాట్ ప్రదర్శనపై రేటింగ్ ఇచ్చారు. నేటీ ఆట తీరును చూసి.. ఇది నిస్సందేహంగా కోహ్లీ కేరిర్ లో అత్యుత్తమ ఇన్నింగ్స్ అవుతోందని అన్నారు. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ తర్వాత కోహ్లిని భారత మాజీ బ్యాటింగ్ మాస్ట్రో అభినందించారు.
సచిన్ తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. ఇది నిస్సందేహంగా మీ జీవితంలో అత్యుత్తమ ఇన్నింగ్స్. మీ ఆట చూడటం చాలా ఆనందంగా ఉంది, 19వ ఓవర్‌లో రవూఫ్‌పై లాంగ్ ఆన్‌లో బ్యాక్‌ఫుట్‌లో సిక్స్ కొట్టడం అద్భుతం! ఈ ఆట తీరును అలాగే కొనసాగించండి." అని టెండూల్కర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
మ్యాచ్ తర్వాత హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌తో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటి అని అన్నారు. 2016 ICC T20 ప్రపంచ కప్‌లో మొహాలీలో ఆస్ట్రేలియాతో జరిగిన తన క్లాసిక్ కంటే.. నేటీ నాక్ చాలా మెరుగైనదిగా రేట్ చేసాడు. 2021లో కోహ్లి భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడే చివరి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయింది.
గతంలో ఆయన సారథ్యంలో పాకిస్థాన్‌పై భారత్ ఎన్నో మ్యాచ్ ల్లో విజయం సాధించింది. అలాగే.. 2012 ఆసియా కప్‌లో టెండూల్కర్‌తో కలిసి కోహ్లి 183 పరుగులతో పాక్‌పై భారత్‌కు గొప్ప విజయాన్ని అందించాడు. అప్పటి నుండి కోహ్లీ ఎన్నో అత్యుత్తమ నాక్‌లను ఆడారు. అంతర్జాతీయ క్రికెట్‌కు టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత కోహ్లి భారత ప్రీమియర్ బ్యాటర్‌గా అవతరించాడు.