‘ సారీ సర్.. ఇప్పుడే ఫ్రెండ్ ని కత్తితో పొడిచి వస్తున్నా’’

Published : Nov 16, 2018, 12:37 PM IST
‘ సారీ సర్.. ఇప్పుడే ఫ్రెండ్ ని కత్తితో పొడిచి వస్తున్నా’’

సారాంశం

హెల్మెట్ లేదని ఓ వ్యక్తి బైక్ ఆపిన పోలీసులకు ఆ యువకుడు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.

హెల్మెట్ లేదని ఓ వ్యక్తి బైక్ ఆపిన పోలీసులకు ఆ యువకుడు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. హెల్మెట్ లేనందుకు ఫైన్ కట్టమని అడిగిన ట్రాఫిక్ పోలీసుకి.. ‘సారీ సర్.. ఇప్పుడే ఫ్రెండ్ ని కత్తితో పొడిచి వస్తున్నాను.. పోలీసులకు లొంగిపోదామని స్టేషన్ కే వెళ్తున్నాను’’ అంటూ రక్తంతో కూడిన కత్తి చూపించాడు. అది చూసి ఒక్కసారిగా షాకయిన పోలీసులు.. వెంటనే కత్తిని సీజ్ చేసి.. అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చిక్కబల్లాపుర ప్రాంతానికి చెందిన సందీప్ షెట్టి(26) రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతని  స్నేహితుడు  దేవరాజ్ కి వంట నూనె దుకాణం ఉంది.  రెండేళ్ల క్రితం సందీప్ తన స్నేహితుడు దేవ్ రాజ్ కి రూ.1లక్ష నగదు ఇచ్చాడు. వాటిని అతను రియల్ ఎస్టేట్ లో పెడతానని చెప్పి.. తన సొతానికి వాడుకున్నాడు. 

అయితే.. ఆ డబ్బులు ఇవ్వమని సందీప్ అడగగా.. ఇవ్వనని తేల్చి చెప్పాడు దేవరాజ్. దీంతో కోపంతో ఊగిపోయిన సందీప్ స్నేహితుడిని కత్తితో పొడిచాడు. అక్కడి నుంచి దేవరాజ్ బైక్ పై పారిపోతుండగా.. హెల్మెట్ లేదని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. దీంతో బయపడిపోయిన సందీప్.. విషయాన్ని బయటపెట్టాడు.  కాగా.. దేవరాజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.  

పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?