సుష్మా స్వరాజ్‭పై అమెరికా మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. దీటుగా సమాధానమిచ్చిన జైశంకర్

By Rajesh KarampooriFirst Published Jan 26, 2023, 4:48 AM IST
Highlights

అమెరికా విదేశాంగ మాజీ మంత్రి మైక్పాంపియో చేసిన అవమానకరమైన మాటలకు విదేశాంగ మంత్రి జైశంకర్ ధీటుగా సమాధానం ఇచ్చారు. పాంపియో పుస్తకంలో సుష్మా స్వరాజ్‌ను ప్రస్తావిస్తూ ఓ భాగాన్ని చూశానని జైశంకర్ అన్నారు. భారత విదేశాంగ విధాన బృందంలో నా భారత సహచరుడికి ముఖ్యమైన పాత్ర లేదని పాంపియో తన పుస్తకంలో రాశాడు.

భారత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‭పై అమెరికా విదేశాంగ మాజీ మంత్రి మైక్ పాంపియా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన రాసిన  'నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ది అమెరికా ఐ లవ్' పుస్తకంలో సుష్మా స్వరాజ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ విధాన బృందంలో సుష్మాకు ముఖ్యమైన పాత్ర లేదని ఆయన అన్నారు. పాంపే వారి కోసం "గూఫ్‌బాల్" (తక్కువ తెలివితేటలు) అనే అవమానకరమైన పదాన్ని ఉపయోగించాడు.

ధీటుగా సమాధానమిచ్చిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 
 
సుష్మా స్వరాజ్‭పై అమెరికా విదేశాంగ మాజీ మంత్రి మైక్ పాంపియా చేసిన అవమానకరమైన మాటలకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ధీటైన సమాధానం ఇచ్చారు. జైశంకర్ మాట్లాడుతూ.. పాంపియో పుస్తకంలో ఒక భాగాన్ని చూశాను. సుష్మా స్వరాజ్‌ని నేను ఎప్పుడూ చాలా గౌరవిస్తాను. ఆమెతో మాకు చాలా సన్నిహిత,  సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. సుష్మా స్వరాజ్‭ని  అగౌరవపరిచేలా చేసిన వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.

జైశంకర్‌పై ప్రశంసలు 

భారత విదేశాంగ విధాన బృందంలో సుష్మా స్వరాజ్‌ ముఖ్యమైన పాత్ర లేదని పాంపియో తన పుస్తకంలో పేర్కొన్నారు. బదులుగా తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో మరింత సన్నిహితంగా పనిచేశానని పేర్కొన్నారు. సుష్మా స్వరాజ్ 2014 నుండి మే 2019 వరకు దేశ విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు.  పాంపియో తన పుస్తకంలో జైశంకర్‌ను ప్రశంసించారు. మే 2019లో భారత కొత్త విదేశాంగ మంత్రిగా 'జె' (జైశంకర్)ని స్వాగతించామని ఆయన చెప్పారు. ఆయన కంటే మెరుగైన సమానమైన, మెరుగైన వారు ఉండరని పేర్కొన్నారు.  

భారత్-పాక్ సంబంధాలపై 

2019 ఫిబ్రవరిలో బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ తర్వాత భారత్‌, పాకిస్థాన్‌లు అణుయుద్ధానికి చేరువయ్యారని  పాంపియో తన పుస్తకంలో పేర్కొన్నారు. దాడికి పాకిస్థాన్ అణ్వాయుధాలను ప్రయోగిస్తోందని ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రి నుంచి తనకు కాల్ వచ్చిందని రాశారు. భారత్ కూడా తన రక్షణ కోసం ఎదురు సన్నాహాలు చేస్తోందని తెలిపినట్టు పేర్కోన్నారు. తాను ఆ సమయంలో హనోయి పర్యటనలో ఉన్నాననీ, తనకు భారతీయ కౌంటర్ నుండి కాల్ వచ్చింది. ఆ నిర్ణయంతో తాను రాత్రంతా నిద్రపోలేదనీ, భారతదేశాన్ని ఏమీ చేయవద్దని కోరినట్టు పేర్కోన్నారు.

దీని తర్వాత అప్పటి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అంటే వాస్తవాధినేత జనరల్ కమర్ జావేద్ బజ్వాను సంప్రదించినట్లు మాజీ విదేశాంగ మంత్రి తెలిపారు. ఈ విషయం తెలిసిన తర్వాత మా టీమ్ రాత్రంతా మేల్కొని దాన్ని పరిష్కరించడానికి శ్రమించానని  పాంపియో రాశారు. దాడికి భారత్‌ కానీ, పాకిస్థాన్‌ కానీ సన్నద్ధం కావడం లేదని ఇరు దేశాలను నమ్మించేందుకు టీమ్‌ ప్రయత్నించినట్టు తెలిపారు.

click me!