"అదో దురలవాటు ".. పాశ్చాత్యదేశాల తీరుపై జైశంకర్ మండిపాటు

Published : Apr 03, 2023, 12:04 AM IST
"అదో దురలవాటు ".. పాశ్చాత్యదేశాల తీరుపై జైశంకర్ మండిపాటు

సారాంశం

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనర్హత వేటుపై  అమెరికా,జర్మనీలు స్పందిచడాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తప్పుబట్టారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పాశ్చాత్య దేశాలకు అలవాటుగా మారిందనీ, అది వారికి ఉన్న దురలవాటని అభిప్రాయపడ్డారు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనర్హత వేటు వేయడంపై జర్మనీ, అమెరికాలు స్పందిచడాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఇతర దేశాల అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించడం పశ్చిమ లేదా పాశ్చాత్య దేశాలకు ఉన్న ఓ దురలవాటని మంత్రి ఎస్ జైశంకర్ విమర్శించారు. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య, బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ కబ్బన్ పార్క్‌లో నిర్వహించిన 'మీట్ అండ్ గ్రీట్'కార్యక్రమంలో మంత్రి  జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన పాశ్చాత్య దేశాల తీరు, ఉచిత పథకాల గురించి మాట్లాడారు. 
 
విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. " మీకు నిజమైన సమాధానాలు చెప్పదల్చుకున్నాను. రెండు కారణాలున్నాయి. మొదటిది.. పాశ్చాత్య దేశాలకు ఇతర దేశాలపై వ్యాఖ్యానించే చెడు అలవాటు ఉంది. వారు తమకు దేవుడిచ్చిన ప్రత్యేక అర్హతగా భావిస్తారు. వారు ఇలా చేస్తూనే ఉంటే.. వారి గురించి కూడా ఇతరులు మాట్లాడటం ప్రారంభిస్తారు. అది జరిగినప్పుడు వారు ఇష్టపడరని వారు అనుభవం ద్వారా మాత్రమే నేర్చుకోవాలి.  ప్రస్తుతం అదే జరుగుతోంది.  

"రెండోది..   మా వాదనలలో మీపై వ్యాఖ్యానించమని మీరు ప్రజలను ఆహ్వానిస్తున్నారు. అప్పుడు ఎక్కువ మంది వ్యాఖ్యానించడానికి ప్రలోభాలకు గురవుతారు. మాకు కూడా సమస్యలు ఉన్నాయని ప్రపంచానికి ఉదారంగా ఆహ్వానాలు ఇవ్వడం మానేయాలి. భారతదేశంలో సమస్యలున్నాయి. మీరు ఏమీ చేయకుండా ఎందుకు నిలబడి ఉన్నారు? మీరెందుకు మాట్లాడటం లేదు. ఏవైనా చేయొచ్చు కదా.. అని ఇతరులకు అవకాశం ఇస్తే వారు తప్పకుండా తమ స్పందన తెలియజేస్తారు.  నిజానికి సమస్య వారిదే, సమస్యలో కొంత భాగం మనది. ఇద్దరికీ పరిష్కారం అవసరమని భావిస్తున్నాను.రెండింటిని సరిచేయాల్సిన అవసరం ఉంది" అని మంత్రి అన్నారు. 

రాజకీయ పార్టీల ఉచితా పథకాల(ఫ్రీబీ)సంస్కృతిని మంత్రి జైశంకర్ వ్యతిరేకిస్తూ..  “ఈ ఫ్రీబీ కల్చర్ - దేశంలో కొంత మందికి గుర్రుగా ఉన్నారు, వనరులను పెంచే బాధ్యత తమ వద్ద లేదు కాబట్టి వారు అలా చేస్తున్నారు. ఉచిత పథకాల ఆధారంగా దేశాన్ని నడపలేరు. ఉచిత పథకాలు త్వరగా ప్రజాదరణ పొందడానికి ఉపయోగపడతాయని, ఇది బాధ్యతారాహిత్యమైన మార్గమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన దిల్లీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఉచితాల విషయంలో దిల్లీ ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తుందనీ, ఉచితాల కోసం వాళ్లకు ఎలాంటి వనరులు అవసరం లేదని మంత్రి వ్యాఖ్యానించారు.

అసలేం జరిగింది..? 

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ 2019లో  'మోడీ' అనే ఇంటిపేరును ఉపయోగించి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా నమోదైంది. ఈ కేసులో గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించింది. దీంతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యునిగా అనర్హుడయ్యాడు. కాంగ్రెస్ నేతకు కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేశారు, ఈ సమయంలో రాహుల్ గాంధీ తన నేరానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసుకోవచ్చు. రాహుల్ గాంధీపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువునష్టం కేసు వేశారు.

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హత వేటు వేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ దిగువ సభలో సభ్యత్వం కోల్పోయిన నేపథ్యంలో తన చుట్టూ ఉన్న ఆప్-మైండెడ్ ఆటగాళ్లను కూడగట్టుకునేందుకు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంతో కాంగ్రెస్, అధికార బీజేపీల మధ్య చిచ్చు రేపుతోంది, అదానీ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడగా ప్రతిపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ 2019లో కేరళలోని వాయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సూరత్ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని ఆ పార్టీ తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్