పశు వ్యాపారి నుంచి రూ. 2 లక్షలు డిమాండ్.. ఆపై హత్యచేసిన గోరక్షకులు! పరారీలో నిందితులు

Published : Apr 02, 2023, 07:58 PM IST
పశు వ్యాపారి నుంచి రూ. 2 లక్షలు డిమాండ్.. ఆపై హత్యచేసిన గోరక్షకులు! పరారీలో నిందితులు

సారాంశం

కర్ణాటకలో ఓ పశువుల వ్యాపారిని గోరక్షకులు అడ్డుకుని చంపేశారు. పశువులను లోడ్ చేసుకుని వాహనంలో వెళ్లుతున్న ఇద్రీస్ పాషాను వారు అడ్డుకున్నారు. రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. కానీ, అతను తిరస్కరించడంతో దాడి చేసి చంపేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.  

బెంగళూరు: కర్ణాటకలో ఓ పశువుల వ్యాపారిని కొందరు గోరక్షకులు హత్య చేశారు. పశువులను కొనుగోలు చేసి వాహనంలో తరలించుకు వస్తుండగా గోరక్షకులు ఆయనను అడ్డుకున్నారు. రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. తాను ఆ పశువులను కొనుగోలు చేశానని, అందుకు సంబంధించిన దస్త్రాలను కూడా చూపించాడు. కానీ, ఆ గోరక్షకులు అతడిని దాడిని చేసి చంపేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ హత్యను నిరసిస్తూ ముస్లిం కమ్యూనిటికీ చెందిన వారు కర్ణాటకలోని మాండ్యలో భారీ ప్రదర్శన చేపట్టారు.

శనివారం సాయంత్రం ఇద్రీస్ పాషా మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. రామానగర జిల్లా సాతనూర్ గ్రామంలో రోడ్డు పక్కన ఆయన డెడ్ బాడీ కనిపించింది. రైట్ వింగ్ యాక్టివిస్ట్ పునీత్ కెరెహల్లి సారథ్యంలోని గో రక్షకులు పాషాను హతమార్చారని పాషా కుటుంబం ఆరోపించింది.

పాషా కుటుంబ సభ్యుల ప్రకారం, పునీత్ కెరెహల్లి శనివారం మధ్యాహ్నం పాషాను అడ్డుకున్నారు. ఆయన పశువులను రవాణా చేస్తున్నాడు. ఆయన నుంచి రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. 

Also Read: అసోం సీఎం హిమంత శర్మ వార్నింగ్ ఇస్తే.. టీ ఆఫర్ చేసిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ‘సీఎంకు అది తగదు’

తాను ఆ పశువులను కొనుగోలు చేశానని స్పష్టంగా చెప్పినప్పటికీ డబ్బులు ఇవ్వలేదని పునీత్ కెరెహల్లీ గ్రూపు ఆయనపై దాడి చేశారు. పాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత పాషా ఆ గాయాలతో మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. పునీత్ కెరెహల్లి, ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్