నూతన వధూవరులకు షాకిచ్చిన కోర్టు: మాస్క్ ధరించనందుకు రూ. 10 వేల జరిమానా

By narsimha lodeFirst Published Jun 3, 2020, 10:50 AM IST
Highlights

పెళ్లి సమయంలో మాస్కులు ధరించనందుకు నూతన వధూవరులకు హార్యానా కోర్టు మంగళవారం నాడు రూ. 10 వేల జరిమానాను విధించిందింది.
 

చంఢీఘడ్:పెళ్లి సమయంలో మాస్కులు ధరించనందుకు నూతన వధూవరులకు హార్యానా కోర్టు మంగళవారం నాడు రూ. 10 వేల జరిమానాను విధించిందింది.

కొత్తగా పెళ్లి చేసుకొన్న వధూవరులు తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. తమ పెళ్లికి  తమ రెండు కుటుంబాల నుండి వ్యతిరేకిస్తున్నందున రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు.

హర్యానా హైకోర్టు బెంచ్ జస్టిస్ హరిపాల్ వర్మ కొత్త జంట పెళ్లి ఫోటోలను పరిశీలించారు. ఈ జంట పెళ్లి సమయంలో ఎలాంటి మాస్కులను ధరించలేదు. దీంతో ఈ జంటకు కోర్టు రూ. 10 వేల జరిమానాను విధించారు.

కరోనా వ్యాప్తి చెందకుండా నివారించేందుకు గాను మాస్కులు ధరించాలనే నిబంధనను తుంగలో తొక్కినందుకు గాను కోర్టు ఈ దంపతులకు రూ. 10 వేల జరిమానాను విధించింది.15 రోజుల్లోపుగా ఈ జరిమానా డబ్బులను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. హోషిరాపూర్ ప్రాంతంలో ప్రజలకు మాస్కులు అందించేందుకు గాను రూ. 10 వేలను ఉపయోగించాలని కోర్టు  ఆదేశించింది.

also read:రోహిణి కోర్టు జడ్జికి కరోనా: ఇండియాలో మొత్తం కేసులు 2,07,611కి చేరిక

పంజాబ్ రాష్ట్రంలో మాస్కులు ఉపయోగించాలనేది అనివార్యం. ఇంటి నుండి నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం కానీ, ఇతర అవసరాల కోసం వచ్చే వారు కచ్చితంగా మాస్కులు ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

click me!