ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్.. జాతిపిత: ముస్లిం ప్యానెల్ చీఫ్ ప్రశంసలు

By Mahesh KFirst Published Sep 22, 2022, 5:57 PM IST
Highlights

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పై ముస్లిం ప్యానెల్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన జాతి పిత అని, జాతి రుషి అని కొనియాడారు. ఆయన మసీదు సందర్శనతో పాజిటివ్ మెస్సేజెస్ వెళ్తాయని వివరించారు.
 

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ హెడ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ పై ప్రశంసలు కురిపించారు. ఆయనను జాతిపిత అని కొనియాడారు. ముస్లిం నేతలతో సమావేశం అవుతున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ రోజు ఢిల్లీలోని ప్రముఖ మత పెద్దతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత ఉమర్ అహ్మద్ ఇల్యాసీ మోహన్ భాగవత్‌ పై పొగడ్తలు కురిపించారు.

‘మోహన్ భాగవత్ ఈ రోజు నా ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చారు. ఆయన జాతి పిత, జాతి రుషి కూడా. ఆయన పర్యటనతో మంచి సందేశం వెళ్తుంది. మా ప్రార్థనా విధానాలు వేరు, కాని, అతిపెద్ద మతం మానవత్వమే. దేశమే అన్నింటి కంటే ముందు అని మేమూ విశ్వసిస్తాం’ అని ఆయన తెలిపారు.

మోహన్ భాగవత్ గురువారం ఢిల్లీలోని కస్తుర్బా గాంధీ మార్గ్‌లో ఉన్న ప్రముఖ మసీదును సందర్శించారు. ఆ తర్వాత ఉత్తర ఢిల్లీలో ఆజాద్‌పూర్‌లోని తాజ్‌వీదుల్ ఖురాన్ మదర్సాకు వెళ్లారు. 

నెల వ్యవధిలో ముస్లిం మేధావులతో ఇది మోహన్ భాగవత్ రెండో భేటీ కావడం గమనార్హం. ఈ భేటీ పై ఆర్ఎస్ఎస్ స్పోక్స్‌పర్సన్ సునీల్ అంబేకర్ మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ జీవితపు అన్ని కోణాలకు చెందిన ప్రజలను కలుస్తుంటారని, ఇది కూడా అందులో భాగమేనని వివరించారు. మోహన్ భాగవత్‌కు, కస్తుర్బా గాంధీ మార్గ్‌లోని మాస్క్ ఇమామ్‌తో గంటకు పైగా చర్చ జరిగినట్టు సమాచారం.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ గురువారం ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసీని కలిశారు. ముస్లిం కమ్యూనిటీకి చేరువయ్యే ప్ర‌య‌త్నంలో భాగంగా ఈ ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీలో ఉన్న కస్తూర్బా గాంధీ మార్గ్ లో ఉన్న మసీదులో దాదాపు గంటకు పైగా త‌లుపులు వేసుకొని వారి మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది. మోహ‌న్ భ‌గ‌వ‌త్ వెంట సంఘ్ సీనియర్ కార్యకర్తలు కృష్ణ గోపాల్, రామ్ లాల్, ఇంద్రేష్ కుమార్‌లు ఉన్నారు.

గత నెల ముస్లిం నేతలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌ను కలిసి సమావేశమై చర్చించడాన్ని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరకించారు. వారు ఉన్నత (కులీన్?) వర్గాలకు చెందినవారని, వారికి క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ విషయాలపై అవగాహన లేదని స్పష్టం చేశారు. 

ఆర్ఎస్ఎస్ ఎలాంటిది? దాని భావజాలం ఏమిటి? అనేది ప్రపంచం అంతా తెలుసు అని, కానీ, వీరు మాత్రం భాగవత్ దగ్గరకు వెళతారు.. ఆయనను కలుస్తారని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.  ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఈ ఉన్నత వర్గాలు ఏది చేసినా అది సత్యం అని, కానీ, తాము ప్రాథమిక హక్కుల కోసం పోరాడినా తప్పుగానే చిత్రిస్తారని వివరించారు. 

నిజానికి ఎంతో మేధస్సు ఉన్నట్టుగా భావించే ఈ ఉన్నత వర్గ ముస్లిం నేతలకు వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితుల గురించిన అవగాహన లేదని విమర్శలు చేశారు. వారు కంఫర్టబుల్‌గా జీవిస్తారని, ఆర్ఎస్ఎస చీఫ్‌ను కూడా వెళ్లి కలిసి వస్తారని పేర్కొన్నారు. అది వారి ప్రజాస్వామ్య హక్కు అని, దాన్ని తాను ప్రశ్నించడం లేదని అన్నారు. కానీ, తమను ప్రశ్నించే హక్కు వారికి లేదని స్పష్టం చేశారు.

click me!