రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?

Published : Sep 06, 2023, 10:54 PM IST
రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?

సారాంశం

రిజర్వేషన్లపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక ప్రకటన చేశారు. సమాజంలో వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలని ఆయన అన్నారు. అదే సమయంలో అఖండ భారత్ గురించి కూడా ఆయన కీలక ప్రకటన చేశారు. 

మోడీ ప్రభుత్వం దేశం పేరు మార్చబోతుందా? 'ఇండియా వర్సెస్ భారత్' వివాదంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశం పేరుతో ప్రతిపక్షాలు నిరంతరం ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. వీటన్నింటి మధ్య రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రముఖ్ మోహన్ భగవత్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశ సంస్కృతిని నిర్మూలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు. మంగళవారం నాగ్‌పూర్‌లో ఆయన మాట్లాడుతూ.. 'మన సంస్కృతి మూలాలు సత్యంపై ఆధారపడి ఉన్నాయని, అయినప్పటికీ ఈ సంస్కృతిని నిర్మూలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

అదే సమయంలో  అఖండ భారత్ గురించి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. 'అఖండ భారత్' లేదా అవిభక్త భారతదేశం నేటి యువతరం వృద్ధాప్యం కాకముందే సాకారం అవుతుందని అన్నారు. అఖండ భారత్ ఎప్పుడు అమల్లోకి వస్తుందో ఖచ్చితంగా చెప్పలేనని అన్నారు. కానీ, మీరు దాని కోసం పని చేస్తూనే ఉంటే.. మీరు వృద్ధాప్యం పొందకముందే అది సాకారమవుతుందని అన్నారు. ఎందుకంటే భారతదేశం నుండి విడిపోయిన వారు తప్పు చేశామని భావించే పరిస్థితులు వచ్చాయని అన్నారు. కానీ, భారతదేశం కావడానికి మ్యాప్‌లోని గీతలను చెరిపివేయాలని కొందరూ భావిస్తారనీ, కానీ.. అది అలా సాధ్యం కాదని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అన్నారు.

1950 నుండి 2002 వరకు ఇక్కడి ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదనే వాదనలపై భగవత్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ఆగస్టు 15, జనవరి 26 తేదీలలో మనం ఎక్కడ ఉన్నా జాతీయ జెండాను ఎగురవేస్తాము. నాగ్‌పూర్‌లోని మహల్, రేషింబాగ్‌లోని క్యాంపస్‌లలో జెండా ఎగురవేస్తున్నాము. ప్రజలు మమ్మల్ని ఈ ప్రశ్న అడగకూడదు." అని తెలిపారు. 1933లో జల్‌గావ్‌ సమీపంలో జరిగిన కాంగ్రెస్‌ తేజ్‌పూర్‌ సదస్సులో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ 80 అడుగుల స్తంభంపై జాతీయ జెండాను ఎగురవేసిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ నాశనమైపోతోందని, అయితే సత్యమే పునాది కాబట్టి భారతదేశం ఈ సంక్షోభం నుంచి బయటపడిందని భగవత్ అన్నారు.'మార్క్సిజం' గురించి భగవత్ ప్రస్తావిస్తూ.. 'కొందరు తమ స్వార్థం కారణంగా ప్రాపంచిక ఆనందాలను నెరవేర్చుకునే ఈ ధోరణిని సమర్థించటానికి ప్రయత్నిస్తారు. ఇంతమంది ఇలాంటి అనైతికతకు మద్దతు ఇస్తున్నారు. సమాజంలో ఇటువంటి గందరగోళం వారికి సహాయం చేస్తుందనీ, వారు తమ ఆధిపత్యాన్ని స్థాపించవచ్చని అన్నారు.  

రిజర్వేషన్లపై కీలక ప్రకటన

రిజర్వేషన్లపై మోహన్ భగవత్ కీలక ప్రకటన చేశారు. సమాజంలో వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లు కొనసాగాలని ఆయన అన్నారు.  సామాజిక వ్యవస్థలో కొంత మందిని వెనుకకు వదిలివేసామనీ, వారిని పట్టించుకోలేదని అన్నారు. అణివేత, వెనుకబాటు తనానికి గురైన వారికి సమానత్వాన్ని అందించనంత వరకు.. కొన్ని ప్రత్యేక చికిత్సలు ఉండాలనీ, రిజర్వేషన్ వాటిలో ఒకటని అన్నారు. అందుకే అప్పటి వరకు రిజర్వేషన్ కొనసాగించాలని,  వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్‌కు పూర్తి మద్దతు ఇస్తుందనీ, వివక్ష కనిపించకపోవచ్చు, కానీ సమాజంలో అది ప్రబలంగా ఉందని అన్నారు. ఆర్థికంగా లేదా రాజకీయంగా సమానత్వం కల్పించడమే కాకుండా గౌరవం ఇవ్వాలని అన్నారు.  రాజ్యాంగం ప్రకారం, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) కుల ప్రాతిపదికన వివక్ష కారణంగా రిజర్వేషన్లు పొందుతాయి. మండల్ కమిషన్ సిఫార్సుల తర్వాత ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)లకు కూడా రిజర్వేషన్లు లభిస్తున్నాయి.

ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపణలు

భారతదేశం పేరును భారత్‌గా మార్చడంపై వివాదం నడుస్తుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపి సంజయ్ సింగ్ మంగళవారం నాడు మోహన్ భగవత్ నేతృత్వంలోని ఆర్‌ఎస్‌ఎస్ భారత్ నుండి 'ఇండియా' అనే పదాన్ని "తొలగించడం" ద్వారా దేశ రాజ్యాంగాన్ని మార్చాలని భావిస్తోందని ఆరోపించారు. మోహన్ భగవత్ ఇండియాకు బదులుగా 'భారత్' పేరును ఉపయోగించాలని, ఈ అలవాటును అలవర్చుకోవాలని ప్రజలను కోరారు. భీమ్‌రావ్ అంబేద్కర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ, మోహన్ భగవత్‌లకు ఎందుకు 'ద్వేషం గా ఉన్నారని ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. బాబాసాహెబ్‌ను ద్వేషించే మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?