టెక్నాలజీ అంటే చైనాయే.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 15, 2021, 3:35 PM IST
Highlights

టెక్నాలజీ అంటే చైనా గురించి మాట్లాడుకోక తప్పదన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ప్రతిసారి చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తుంటామని కానీ.. మీ మొబైల్ ఫోన్లలో వుండే ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వస్తోందని ఆయన ప్రశ్నించారు

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్వావలంబన, స్వయం సమృద్ది తదితర అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మనమంతా ఇంటర్నెట్ తో పాటు అనేక రూపాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని.. కానీ వాస్తవానికి వాటి వెనకున్న టెక్నాలజీ మనది కాదు అని మోహన్ భగవత్ అన్నారు. మనం బయటి నుంచి దానిని తెచ్చుకుంటున్నామని... టెక్నాలజీ అంటే చైనా గురించి మాట్లాడుకోక తప్పదని గుర్తుచేశారు. ప్రతిసారి చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపునిస్తుంటామని కానీ.. మీ మొబైల్ ఫోన్లలో వుండే ప్రతి వస్తువు ఎక్కడి నుంచి వస్తోందని మోహన్ భగవత్ ప్రశ్నించారు. ఒకవేళ మనం చైనాపై ఆధారపడడం మరింత పెరిగితే, వాళ్లకు మనం దాసోహం అనకతప్పదని ఆయన  హెచ్చరించారు. 

స్వదేశీ అంటే అన్నింటినీ బహిష్కరించడం అని కాదని.. అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగాలని కానీ అది మనకు అనుగుణంగా జరగాలని మోహన్ భగవత్ చెప్పారు. అందుకోసం మనం స్వావలంబన సాధించాలని.. దానితోనే ఉపాధి కల్పన సాధ్యమవుతుందన్నారు. ఒకవేళ మన ఉద్యోగాలు బయటికి వెళ్లిపోతే హింసకు దారిచ్చినట్టేనని అందుకే స్వదేశీ అంటే స్వావలంబన... హింస కాదు అని మోహన్ భగవత్ వివరణ ఇచ్చారు

click me!