PV Sindhu: సింధూకి పార్లమెంట్ లో ప్రశంసలు..!

Published : Aug 02, 2021, 12:34 PM IST
PV Sindhu: సింధూకి పార్లమెంట్ లో ప్రశంసలు..!

సారాంశం

వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు ఈ రోజు ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే లోక్ సభ స్పీకర్ సింధు విజయాన్ని ప్రస్తావించారు.

టోక్యో ఒలంపిక్స్  లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. పతకం సాధించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆమె కాంస్యం గెలవడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. తెలుగు తేజం సింధును పార్లమెంట్ ఉభయ సభలు నేడు  అభినందించాయి. 

వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు ఈ రోజు ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే లోక్ సభ స్పీకర్ సింధు విజయాన్ని ప్రస్తావించారు.

‘టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు కాంస్యం సాధించడం ఆనందకరం. ఇది ఆమెకు వరసగా రెండో ఒలంపిక్ పతకం. వ్యక్తిగత ఈవెంట్లలో రెండు పతకాలు అందుకున్న తొలి భారతీయురాలు ఆమె కావడం విశేషం.ఈ చారిత్రక విజయం అందుకున్న సింధుకు సభ్యులందరి తరపున అభినందనలు. ఆమె గెలుపు దేశ యువతకు స్ఫూర్తిదాయకం’ అని స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు. అటు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా సింధును అభినందించారు. తన అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించిందని ఆయన కొనియాడారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?