మధ్యప్రదేశ్‌లో వ్యాపారి ఇంటిపై ఐటీ సోదాలు:వాటర్ ట్యాంక్‌లో కోటి నగదు సీజ్

Published : Jan 09, 2022, 03:26 PM ISTUpdated : Jan 09, 2022, 03:32 PM IST
మధ్యప్రదేశ్‌లో వ్యాపారి ఇంటిపై ఐటీ సోదాలు:వాటర్ ట్యాంక్‌లో కోటి నగదు సీజ్

సారాంశం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శంకర్ రాయ్ అనే వ్యాపారి ఇంట్లోని వాటర్ ట్యాంక్  లో  కోటి నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు.శంకర్ రాయ్ ఇంటి నుండి రూ. 8 కోట్ల లెక్క చూపని Money ను స్వాధీనం చేసుకొన్నామని ఐటీ  అధికారులు తెలిపారు.

భోపాల్:మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని వ్యాపారవేత్త ఇంటిలోని వాటర్ ట్యాంక్ లో కోటి రూపాయాల నగదును ఐటీ అధికారుల స్వాధీనం చేసుకొన్నారు.Madhya pradesh  రాష్ట్రంలోని దామోహ్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త Shankar Rai   అతని కుటుంబంపై గురువారం నాడుIncome Taxఅధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు సంబంధించిన సమాచారాన్ని ఆదాయపన్ను శాఖాధికారులు మీడియాకు వివరించారు.శంకర్ రాయ్ ఇంటి నుండి రూ. 8 కోట్ల లెక్క చూపని Money ను స్వాధీనం చేసుకొన్నామని ఐటీ  అధికారులు తెలిపారు.

అండర్‌గ్రౌండ్  Water Tank లో దాచిన బ్యాగులో కోటి రూపాయాల నగదును స్వాధీనం  చేసుకున్నామని ఐటీ అధికారులు చెప్పారు. శంకర్ రాయ్ ఇంటి నుండి  రూ. 5 కోట్ల విలువైన నగదు కూడా స్వాధీనం చేసకున్నామని అధికారులు తెలిపారు.  రాయ్ ఇంటి నుండి స్వాధీనం చేసుకొన్న నగదుతో పాటు మూడు కిలోల బంగారం కూడా ఉందని  ఐటీ శాఖ జాయింట్ కమిషనర్ మున్మున్ శర్మ చెప్పారు.జబల్‌పూర్ ఆదాయపన్ను శాఖాధికారులు ఈ దాడులు నిర్వహించారు.రాయ్ గతంలో Congress మద్దతుతో దమోహ్ నగర్ మున్సిపల్ చైర్మెన్ గా పనిచేశారు. రాయ్ సోదరుడు కమల్ రాయ్ గతంలో Bjp మద్దతుతో మున్సిపల్ ఛైర్మెన్ గా పనిచేశారు.

గురువారం నాడు తెల్లవారుజాము ఐదు గంటల నుండి సుమారు 39 గంటల పాటు ఐటీ అధికారులు శంకర్ రాయ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. రాయ్ కి సుమారు పదికి పైగా ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రాయ్ కుటుంబం ఉద్యోగుల పేరుతో మూడు డజన్ల బస్సులను నడుపుతుందని కూడా ఆదాయ పన్ను శాఖాధికారులు చెప్పారు. శంకర్ రాయ్ కుటుంబానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరే ప్రాంతంలోనైనా సమాచారం ఇస్తే రూ. 10 వేల రివార్డును ఇస్తామని ఐటీ శాఖాధికారులు చెప్పారు.

శంకర్ రాయ్ ఇంటి నుండి స్వాధీనం చేసుకొన్న కీలకమైన డాక్యుమెంట్ల ఆధారంగా దర్యాప్తును చేస్తామని ఆదాయపన్ను శాఖాధికారులు తెలిపారు.ఇప్పటివరకు స్వాధీనం చేసుకొన్న పత్రాలు , ఆస్తులపై పేరులేకుండా ఉన్న విషయాన్ని కూడాగుర్తించినట్టుగా ఆదాయపన్ను శాఖాధికారులు చెప్పారు. అయితే ఈ పేరులేని ఆస్తులు ఎవరి కబ్జాలో ఉన్నాయనే విషయమై కూడా దర్యాప్తు చేస్తామని తెలిపారు. 

వాటర్ ట్యాంక్ లో దాచిన బ్యాగులో కోటి రూపాయాలు నీటిలో తడిచిపోయాయి.  ఈ నగదును ఐటీ శాఖాధికారులు హెయిర్ డ్రైయర్‌తో ఆరబెట్టారు. అ ఆర్వాత ఐరన్ బాక్స్ తో నగదును తడి లేకుండా చేశారు. ఈ దృశ్యాలను  ఐటీ అధికారులు మీడియాకు రిలీజ్ చేశారు.

ఇటీవలనే  ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సెంటు వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు కోట్ల రూపాయాలను స్వాధీనం చేసుకొన్నారు.  పన్ను ఎగొట్టిన నగదును ఇంట్లో దాచిపెట్టినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. గతంలో ఓ వ్యాపారి ఇంట్లోని డ్రైనేజీ పైపులో నగదును దాచి ఉంచాడు. ప్లంబర్ సహాయంతో పైప్ ధ్వంసం చేసి ఈ నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకొన్న ఘటన కూడా దేశంలో చోటు చేసుకొంది. పన్నులను ఎగ్గొట్టేవారిపై ఐటీ శాఖ నిఘాను ఏర్పాటు చేసింది.

PREV
click me!

Recommended Stories

Viral Video: బతికున్న కూతురుకు అంత్య‌క్రియ‌లు చేసిన తండ్రి.. వైర‌ల్ అవుతోన్న వీడియో
Success Story : పట్టువదలని విక్రమార్కులు.. ఈ ఐదుగురూ లాస్ట్ అటెంప్ట్స్ లోనే IAS సాధించారుగా