పక్కా స్కెచ్ తో యజమాని ఇంట్లో రూ. 8 కోట్లు చోరీ చేసిన పనిమనిషి..

Published : Jul 29, 2022, 12:04 PM IST
పక్కా స్కెచ్ తో యజమాని ఇంట్లో రూ. 8 కోట్లు చోరీ చేసిన పనిమనిషి..

సారాంశం

తనకు పని ఇచ్చిన యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడో పనోడు. ఏకంగా ఎనిమిది కోట్ల నగదు, నగలు కొట్టేసి.. పారిపోయాడు. చివరికి పట్టుబడ్డాడు. 

ఢిల్లీ : యజమాని ఇంటి నుంచి 8 కోట్ల రూపాయల విలువైన నగదు, నగలను దొంగిలించిన సహాయకుడిని, అతడికి సహకరించిన బంధువును పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యజమాని ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అతడి ఇంట్లో బీహార్కు చెందిన మోహన్ కుమార్ గత ఐదేళ్లుగా పని చేస్తున్నాడు. ఈనెల 4వ తేదీన ఇంటి యజమాని తన కుటుంబంతో కలిసి అమెరికాకు వెడుతూ ఇంటి తాళాలు కుమార్ కు ఇచ్చాడు. ఇదే అదనుగా భావించిన కుమార్ ఈ నెల 18న ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని అదే ఇంట్లో పని చేస్తున్న మరో సహాయకుడు యజమానికి సమాచారం అందించాడు.

యజమాని కారు, బంగారం, నగలతో అతడు పరారైనట్లు తెలిపాడు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. అందులో కుమార్,  మరో వ్యక్తితో కలిసి సూట్కేస్ తీసుకొని యజమాని కారులో వెళ్తున్నట్లు కనిపించింది. కుమార్ ఆ కారును రమేష్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు బీహార్ కి వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 5 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా సొత్తును రికవరీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

వీడో దరిద్రుడు.. సొంత చెల్లెలి ఇంట్లో దొంగతనం చేసి, ప్రియురాలితో జల్సాలు.. అన్న అని నమ్మితే...

ఇలాంటి దొంగతనమే మే 26న..గోవాలో జరిగింది. గోవాలో ఓ విచిత్రరీతిలో జరిగిన చోరి ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమాటిక్ గా జరిగిన ఈ దొంగతనం చర్చనీయాంశంగా మారింది. ఎవరూ లేని సమయం చూసి బంగ్లా తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడిన దుండగులు రూ. 20 లక్షల విలువచేసే ఆభరణాలతో పాటు కొంత నగదును ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా ఆ ఇంట్లో ఓ సందేశాన్ని రాసిపెట్టి వెళ్లారు. ఇప్పుడు అదే వైరల్ గా మారింది. ఈ ఘటన దక్షిణ గోవాలోని మార్గోవ్ లో చోటుచేసుకుంది.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆసిబ్ జెక్ అనే వ్యక్తి రెండు రోజులు హాలిడే కోసం బయటకు వెళ్లి మంగళవారం వచ్చాడు. ఇంట్లోకి వచ్చి చూసే సరికి 20 లక్షల విలువ చేసే బంగారం, వెండి ఆవరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించాడు.  అంతేకాకుండా..  ఇంట్లో టీవీ స్క్రీన్ పై ‘ఐ లవ్ యు’  అని మార్కర్ తో రాసి ఉంది. మొదట అది ఏంటో అనుకున్నాడు. ఆ తరువాత కానీ అర్థం కాలేదు. అది గమనించిన ఇంటి యజమాని ఒక్కసారిగా కంగు తిన్నాడు. వెంటనే పోలీసులకు ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  ఇన్స్పెక్టర్ సచిన్ నర్వేకర్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?