ఈ అన్నల ప్రేమ అమూల్యం.. చెల్లి పెళ్లిలో రూ.8కోట్ల విలువైన కానుకలు..

By SumaBala BukkaFirst Published Mar 28, 2023, 8:45 AM IST
Highlights

రాజస్థాన్ లో ఓ చెల్లికి అన్నలు ఇచ్చిన కానుకలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆ సోదరులిద్దరూ ఏకంగా రూ. 8.1కోట్ల విలువైన కానుకలను పెళ్లికి సమర్పించారు.

రాజస్థాన్ : సోదరి మీద ప్రేమ ఉంటే ఏం చేస్తారు?  ఆమెకి ఇష్టమైనది కొనివ్వడం.. ఖరీదైన బహుమతులు ఇవ్వడం.. అపురూపంగా చూసుకోవడం.. ఇలాంటివి మామూలుగా చూస్తుంటాం.  తాహతును బట్టి వేలల్లో, లక్షల్లో ఖర్చు పెట్టి పెళ్లి చేస్తారు. అదీ తండ్రి లేకపోతేనే. కానీ.. వీటన్నింటికి భిన్నంగా తమ సోదరి మీద ప్రేమను  కోట్లాది రూపాయల విలువైన సంపదను కానుకలుగా సమర్పించి మరీ చాటుకున్నారు ఆ సోదరులు. అర్జున్ రామ్ మెహారియా, భగీరథ్ మెహారియా అనే సోదరులు ఇద్దరు.. తమ చెల్లిపై ఉన్న ప్రేమను ఘనంగా చాటుకున్నారు. ఏకంగా రూ.8.1కోట్ల  విలువైన కానుకలు ఆమె పెళ్లిలో ఇచ్చారు.  

ఈ ఘటన రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా ధింగ్ సారా గ్రామంలో జరిగింది. ఆడపిల్ల పెళ్లికి తండ్రి కట్నాలు  ఇవ్వడం.. ఘనంగా పెళ్లిని చేయడం  మామూలే.. కానీ ఈ కాలంలో సోదరులు ఇలా భారీ స్థాయిలో కానుకలు ఇచ్చి పెళ్లి చేయడం అసాధారణమైన విషయమే అని స్థానికులు అంటున్నారు. ఆస్తుల కోసం.. కన్నవారిని, తోడబుట్టిన వారిని  కడతేరుస్తున్న నేటి కాలంలో..  సోదరికి ఏకంగా ఎనిమిది కోట్లకు పైగా విలువైన కానుకలు ఇచ్చి పెళ్లి చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

సావర్కర్‌ను అవమానించడం ద్వారా రాహుల్ సత్యయుద్ధంలో గెలవలేరు: సామ్నా సంపాదకీయం

ఈ కానుకల్లో రూ.2.21 కోట్ల నగదు, రూ.4.42 కోట్ల  విలువైన భూమి, 1.1 కిలోల బంగారం, 14 కిలోల వెండి వస్తువులు, ఒక స్కూటీ, ఇంకొన్ని వాహనాలు, ట్రాక్టర్ గోధుమలు.. లాంటివి కూడా ఉన్నాయి. ఈ కానుకలన్నింటినీ వందల సంఖ్యలో కార్లు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు,  ఒంటెల బండ్లతో ర్యాలీగా తీసుకొచ్చారు. ఈ కానుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన వారంతా ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు.

రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఆడబిడ్డ పెళ్లికి మైరా సంప్రదాయం ప్రకారం అన్నదమ్ములు ఇలా భారీ స్థాయిలో కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. మామూలుగా అన్ని పెళ్లిళ్లలోనూ కానుకలు ఇస్తున్నప్పటికీ ఈ స్థాయిలో ఇప్పటివరకు ఎవరూ కానుకలను ఇవ్వలేదని స్థానికులు చెబుతున్నారు. అన్నదమ్ముల ప్రేమను కొనియాడుతున్నారు. 

click me!