రూ.50 కోట్లిస్తే మోడీని చంపుతా: మాజీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్

Published : May 07, 2019, 12:16 PM IST
రూ.50 కోట్లిస్తే మోడీని చంపుతా: మాజీ బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ తేజ్ బహదూర్

సారాంశం

 రూ. 50 కోట్లిస్తే తాను ప్రధానమంత్రిని హత్య చేస్తానని బీఎస్‌ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ చేసిన వ్యాఖ్యానించినట్టుగా ఓ వీడియోను బీజేపీ నేతలు బయటపెట్టారు. 

న్యూఢిల్లీ: రూ. 50 కోట్లిస్తే తాను ప్రధానమంత్రిని హత్య చేస్తానని బీఎస్‌ఎఫ్ మాజీ కానిస్టేబుల్ తేజ్ బహదూర్ యాదవ్ చేసిన వ్యాఖ్యానించినట్టుగా ఓ వీడియోను బీజేపీ నేతలు బయటపెట్టారు. 

సోమవారం నాడు బీజేపీ నేతలు ఈ వీడియోను మీడియాకు విడుదల చేశారు.  వారణాసి ఎంపీ స్థానం నుండి ఎస్పీ అభ్యర్ధిగా తేజ్ బహదూర్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ నామినేషన్‌ను ఈసీ తిరస్కరించిన విషయం తెలిసిందే.

ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని తానేనని ఆయన ఒప్పుకొన్నాడు. కానీ, ప్రధానమంత్రిని రూ. 50 కోట్లిస్తే చంపుతానని తాను ఏనాడూ అనలేదన్నారు. ఈ వీడియోను 2017లో న్యూఢిల్లీలో తాను ధర్నా చేసే సమయంలో పోలీస్ కానిస్టేబుల్ చిత్రీకరించాడన్నారు. తనను బీఎస్‌ఎఫ్ నుండి  డిస్మిస్ చేసిన  సమయంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు.

ఆ సమయంలో తాను అనేక సమస్యల గురించి మాట్లాడినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.  కానీ, ఏనాడూ కూడ ప్రధానిని హత్య చేస్తానని చెప్పలేదన్నారు.
ఈ వీడియోను చిత్రీకరించిన కానిస్టేబుల్ తనను రెండు వారాల క్రితం కలిసినట్టుగా చెప్పారు.

 ఆర్థిక అవకతవకలకు పాల్పడే ఓ వ్యవహారంలో తనతో కలిసి పనిచేయాలని కోరితే తాను తిరస్కరించినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఆ సమయంలో తన వీడియోను చూపి ఈ వీడియోను సర్కులేట్ చేస్తానని బెదిరించాడని  తేజ్ బహదూర్ చెప్పారు. అంతేకాదు తనను రూ. 50 లక్షలు ఇవ్వాలని కూడ డిమాండ్ చేశాడని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

జూన్ 30 తర్వాత సబ్సిడీ రాదు.. కేంద్రం కీలక నిర్ణయం! | LPG Gas EKYC telugu | Asianet News Telugu
బెస్ట్ కాలేజీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి?? #AccessCareerCounselors #careerguidance