వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు: విపక్షాలకు సుప్రీం షాక్

Published : May 07, 2019, 11:02 AM ISTUpdated : May 07, 2019, 11:15 AM IST
వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు: విపక్షాలకు సుప్రీం షాక్

సారాంశం

50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ 21 పార్టీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను మంగళవారం నాడు సుప్రీంకోర్టు తిరస్కరించింది.  

న్యూఢిల్లీ: 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరుతూ 21 పార్టీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను మంగళవారం నాడు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఏదేని అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 ఈవీఎం వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని ఇదివరకే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై 21 రాజకీయ పార్టీలు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై  సుప్రీంకోర్టు మంగళవారం నాడు సుప్రీంకోర్టు తిరస్కరించింది.

50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటే సుమారు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఈసీ సుప్రీంకోర్టుకు నివేదించింది.50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటే సుమారు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ఈసీ సుప్రీంకోర్టుకు నివేదించింది.  

ఇదిలా ఉంటే గతంలో ఇచ్చిన తీర్పును మార్చే ఉద్దేశ్యం లేదని కోర్టు విపక్ష పార్టీలకు తేల్చి చెప్పింది. అయితే కనీసం 2 శాతం వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోర్టును అభిషేక్ సింఘ్వి కోరారు. ఈ విషయంలో కూడ సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించలేదు.

 

 

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !