ఎస్సై పోస్టుకు రూ. 30 లక్షలు.. స్కాం బట్టబయలు చేసిన సీబీఐ

Published : Sep 14, 2022, 04:42 AM IST
ఎస్సై పోస్టుకు రూ. 30 లక్షలు.. స్కాం బట్టబయలు చేసిన సీబీఐ

సారాంశం

జమ్ము కశ్మీర్‌లో పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగినట్టు తేలింది. రూ. 20 నుంచి 30 లక్షల మేరకు ముందుస్తుగా ముట్టజెప్పితే.. ఎస్సై పోస్టు కోసం ఎగ్జామ్ రాయడానికి ముందే పరీక్ష పత్రం అందుతుందని సీబీఐ తన దర్యాప్తులో వెల్లడించింది.  

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో భారీ రిక్రూట్‌మెంట్ స్కాం బట్టబయలైంది. జమ్ము కశ్మీర్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టు కోసం రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలు చెల్లిస్తే జాబ్ వచ్చేలా ఏర్పాట్లు చేసినట్టు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ అమౌంట్‌ను అభ్యర్థులు పే చేయగానే.. వారికి ముందుగానే కొశ్చన్ పేపర్స్ అందేవని అధికారులు తెలిపారు.

ఈ కేసులో నిందితులకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో మంగళవారం సీబీఐ రైడ్లు చేసంది. ఈ తనిఖీల ద్వారా ఓ విషయం అర్థం అయింది. ఈ స్కాంను కొంత మంది హర్యానాలో ఉండి నడపుతున్నట్టు తెలిసింది. హర్యానాలోని కొంత మంది, జమ్ము కశ్మీర్‌లోని కొందరు టీచర్లు, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కొందరు సేవల్లోని, కొందరు రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు, జమ్ము కశ్మీర్‌లోని కొందరు పోలీసులు కలిసి ఈ స్కాం చేసినట్టు తెలుస్తున్నది.

సీబీఐ మంగళవారం 36 లొకేషన్లలో రైడ్లు చేసింది. మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఈ రైడ్లు జరిగాయి.  

జమ్ము కశ్మీర్ పోలీసు శాఖలో ఎస్సై పోస్టుకు రాసిన రాత పరీక్షలో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్ ప్రభుత్వం సీబీఐకి ఓ ఫిర్యాదు అందించింది. దీంతో ఆగస్టు 3వ తేదీన సీబీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించింది.

ఈ అవకతవకలను గుర్తించడానికి జమ్ము కశ్మీర్ ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే, దుండగులు జేఎస్ఎస్ఎస్‌బీ అధికారులతో కలిసి ఈ కుట్ర చేసినట్టు అర్థం అవుతున్నది. 

జమ్ము, రజౌరీ, సాంబా జిల్లాల్లో ఎక్కువ మంది అభ్యర్థులకు అసాధారణ స్థాయిలో హై పర్సెంటేజీ వచ్చినట్టు ప్రోబ్ కమిటీ వెల్లడించింది.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్