కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే.. మరో వైపు దొంగలు లూఠీ చేసేశారు..!

Published : Nov 27, 2021, 11:30 AM ISTUpdated : Nov 27, 2021, 11:45 AM IST
కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే.. మరో వైపు దొంగలు లూఠీ చేసేశారు..!

సారాంశం

అదును చూసిన దుండగులు  రూ. 2 కోట్లకు పైగా విలువైన డైమండ్‌, బంగారు నగలతోపాటు 95 వేల నగదు చోరీకి పాల్పడ్డారు.  విషయాన్ని గమనించిన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

ముంబయి నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్తకు ఊహించని షాక్ తగిలింది. ఓవైపు అతిథులందరినీ పిలిచి.. అంగ రంగ వైభంగా కూతురి పెళ్లి జరిపిస్తున్నాడు. ఆ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆయనకు.. దొంగలు షాకిచ్చారు.అదను చూసి తమ పని  కానిచ్చేశారు. ముంబై వ్యాపారవేత్తకు చెందిన ఏకంగా రెండు కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు, నగదును దోచు కొనిపోయారు. ఈ భారీ చోరీ ఫైవ్‌స్టార్ హోటల్‌లో గురువారం జరిగింది.  విషయం తెలిసి  వ్యాపారవేత్త  కుటుంబం ఒక్కసారిగా షాక్‌ అయింది. 

వివరాలను పరిశీలిస్తే ముంబైకి చెందిన వ్యాపారవేత్త రాహుల్ భాటియా కుమార్తె వివాహ వేడుక జైపూర్‌లోని ఫైవ్‌స్టార్ హోటల్ క్లార్క్స్ అమెర్‌లో  ఘనంగా జరిపేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా భాటియా, ఇతర కుటుంబ సభ్యులు ఏడో అంతస్తులో బస చేశారు. కింద లాన్‌లో సంగీత్‌ వేడుక  జరుగుతోంది.  అంతా  ఆ హడావిడిలో ఉండగా అదును చూసిన దుండగులు  రూ. 2 కోట్లకు పైగా విలువైన డైమండ్‌, బంగారు నగలతోపాటు 95 వేల నగదు చోరీకి పాల్పడ్డారు.  విషయాన్ని గమనించిన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరుపుతున్నామని,  సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని పోలీసు అధికారి అపహరించినట్లు పోలీసులు రాధారామన్ గుప్తా శుక్రవారం తెలిపారు.

హోటల్ సిబ్బంది సహకారంతోనే దొంగతనం జరిగిందని రాహుల్ భాటియా తన ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో హోటల్ మేనేజ్‌ మెంట్, ఇతర సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వధువు తరపు బంధువులే ఈ పనిచేసి ఉంటారని హోటల్‌ యాజమాన్యం  చెబుతోంది.

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word