పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన: రూ.130 కోట్ల ప్రజా ధనం వృధా

By narsimha lodeFirst Published Aug 1, 2021, 1:34 PM IST
Highlights


జూలై 19వ తేదీన ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో  విపక్షాలు రోజూ ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. పెగాసెస్ అంశంపై విపక్షాల నిరసనలతో ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి.దీంతో సుమారు రూ.130 కోట్ల  ప్రజా ధనం దుర్వినియోగమైందని అధికారులు తెలిపారు.
 

న్యూఢిల్లీ:వర్షాకాల పార్లమెంట్ సమావేశాల అంతరాయం కారణంగా సుమారు రూ. 133 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అయిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి పెగాసెస్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టబడుతున్నాయి. దీంతో పార్లమెంట్ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. జూలై 19వ తేదీ నుండి  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.

కేంద్రమంత్రులు,.జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను పెగాసెస్ సాఫ్‌వేర్ సహాయంతో హ్యాక్ చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర విచారణకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.విపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం తోసిపుచ్చింది.పెగాసెస్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఫోన్లను హ్యాక్ చేయలేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఆశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 

గత శనివారం వరకు లోక్‌సభ 54 గంటలు పని చేయాల్సి ఉండగా కేవలం 7 గంటలు పనిచేసింది. ఇక రాజ్యసభ 53 గంటల్లో 11 గంటలు మాత్రమే పనిచేసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.ఇప్పటివరకు పార్లమెంట్ 107 గంటల్లో 18 గంటలు మాత్రమే పనిచేసింది. సుమారు 89 గంటల పని గంటలు వృధాగా మారాయి. దీంతో సుమారు రూ. 133 కోట్ల ప్రజా ధనం వృదాగాా మారిందని ప్రభుత్వం తెలిపింది.

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించకపోతే మీడియాతో పాటు ప్రజల ముందు కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతామని ప్రధాని మోడీ ప్రకటించిన నాలుగు రోజుల తర్వాత ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పెగాసెస్, వ్యవసాయ చట్టాలను సాకుగా చూపి పార్లమెంట్ సమావేశాలను అడ్డుకొంటున్నారని బీజేపీ ఆరోపించింది. 

విపక్షంలో ఉన్న సమయంలో పార్లమెంట్ సమావేశంలో నిరసన హక్కును ఆ పార్టీ విస్తృతంగా ఉపయోగించుకొందని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి. పెగాసెస్ అంశం వాటర్ గేట్ కంటే పెద్ద కుంభకోణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ పెగాసెస్ సాప్ట్ వేర్ ను తయారు చేసింది. ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలతో తాము వ్యాపారం చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది. 

click me!