
రౌడీగా పేరు తెచ్చుకోవాలన్న సరదాతో ఓ వ్యక్తి హత్యకు పాల్పడిన ఘటన కర్ణాటక లో కలకలం రేపింది. కర్ణాటక, హుబ్లీ గిరానిచలలో ఈ ఘటన చోటు చేసుకుంది. హతుడిని రవి ముద్దనకేరిగా గుర్తించారు.
మంగళవారం రవితో జగడానికి దిగిన రౌడీ విజయ్ అనే వ్యక్తి అతనిని బాగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రవిని కిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక మృతి చెందాడు. విజయ్ సాగిస్తున్న అక్రమ ఇసుక రవాణాకు అధికారులు కళ్లెం వేయడంతో రౌడీగా మారాలని నిర్ణయంచుకున్నాడు.
ఈ నేపథ్యంలో డాబా హోటల్ తెరడానికి ప్రయత్నిస్తున్న అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు హుబ్లీ ఉపనగర పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత నిందితుడు పరారయ్యాడు. కాగా కిమ్స్‌లో హతుడి మృతదేహాన్ని డీసీపీ రామానుజం పరిశీలించారు.