
బీహార్ కుల గణన : బీహార్‌లో కొనసాగుతున్న కుల గణన వివాదాస్పదంగా మారింది. లింగమార్పిడి చేసిన వారిని కులంగా లెక్కించడంపై తాజా వివాదం తలెత్తింది. బీహార్‌లోని కులాలు (బీహార్ కుల గణన) ఇప్పుడు సంఖ్యల రూపంలో కోడ్‌ల ఆధారంగా గుర్తించబడతాయి. కుల గణన ఏప్రిల్ 15 నుండి మే 15 వరకు జరుగనున్నది. ఈ క్రమంలో ప్రతి కులానికి ఒక సంఖ్యా కోడ్ కేటాయించబడింది. వివిధ కులాలకు మొత్తం 215 కోడ్‌లు కేటాయించారు. ఈ జాబితాలో థర్డ్ జెండర్‌ను కూడా ప్రత్యేక కులంగా పరిగణించారు. బీహార్‌కు చెందిన NGO దోస్తానా సఫర్ వ్యవస్థాపక కార్యదర్శి రేష్మా ప్రసాద్ ఈ అంశంపై స్పందించారు. థర్డ్ జెండర్‌ను ప్రత్యేక కులంగా పరిగణించే రాష్ట్ర ప్రభుత్వ చర్యను నేరపూరిత చర్యగా అభివర్ణించారు.
థర్డ్ జెండర్‌కు ప్రత్యేకంగా గుర్తింపును ఎలా నిర్ణయించవచ్చో ప్రశ్నించారు. పురుషుడు లేదా స్త్రీని కూడా కులంగా పరిగణించవచ్చా? అదేవిధంగా..ట్రాన్స్‌జెండర్‌ను కులంగా ఎలా పరిగణిస్తారు. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ప్రజలు ఏ కులానికి చెందిన వారైనా కావచ్చు. ఈ చర్య లింగమార్పిడి వ్యక్తుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలకు విరుద్ధమని, ఇది ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్ష చూపడమేనని రేష్మా ప్రసాద్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, థర్డ్ జెండర్‌ను ప్రత్యేక కులంగా పరిగణించరాదని ఆయన అన్నారు. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయంతో ట్రాన్స్‌జెండర్ల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. బీహార్‌లో లింగమార్పిడి జనాభా మొత్తం 40827.
లింగాన్ని కులంగా మార్చడం తప్పు
ఈ అంశంపై తూత్తుకుడి (తమిళనాడు)కి చెందిన ట్రాన్స్ హక్కుల కార్యకర్త , సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గ్రేస్ బాను స్పందిస్తూ.. బీహార్ ప్రభుత్వ చర్య లింగమార్పిడి వర్గానికి చెందిన ప్రజలకు సామాజిక అన్యాయం అని అన్నారు. జెండర్ ఐడెంటిటీ అయిన ట్రాన్స్‌జెండర్ ని జాతిగా ఎలా పరిగణించాలి? ట్రాన్స్‌జెండర్ల సంఘంలో చాలా కులాల వారున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి (బీహార్ ప్రభుత్వం) ట్రాన్స్‌జెండర్లను ఎలా లెక్కించాలో తెలియకపోతే, వారికి సహాయం చేయడానికి తాము ఉన్నామని భరోసా ఇచ్చారు.
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2014)లో ల్యాండ్‌మార్క్ తీర్పులో, చట్టంలోని పార్ట్ III కింద వారి హక్కులను పరిరక్షించే ఉద్దేశ్యంతో ట్రాన్స్‌జెండర్లను థర్డ్ జెండర్‌గా పరిగణిస్తామని సుప్రీంకోర్టు అధికారిక ప్రకటన చేసిందని బాను చెప్పారు. బీహార్ ప్రభుత్వం చేస్తున్న ఈ సామాజిక అన్యాయాన్ని వెంటనే సరిదిద్దాలి. ఒక వ్యక్తిని లింగం ఆధారంగా కులంగా పరిగణించలేమని అన్నారు.
దిద్దుబాటు కోసం అభ్యర్థన
పాట్నాలోని ఏఎన్ సిన్హా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విద్యార్థి వికాస్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వారి డిమాండ్‌ను సమర్థిస్తూ.. వెంటనే సరిదిద్దాలని అన్నారు. ఒక వ్యక్తిని లింగం ఆధారంగా కులంగా పరిగణించలేము. జెండర్ కేటగిరీలలో లింగమార్పిడి కోసం ప్రత్యేక కాలమ్ ఉండాలి. వారు తమ కుల గుర్తింపును వెల్లడించాలనుకుంటే వారికి (ట్రాన్స్ పీపుల్) స్వేచ్ఛ ఇవ్వాలి. అలాంటప్పుడు కుల వర్గాల్లో వారి కులాన్ని పేర్కొనాలి.
బీహార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మదన్ సాహ్ని మాట్లాడుతూ.. వివిధ కులాలకు కేటాయించిన కోడ్‌లతో సహా కుల ఆధారిత గణనను కొనసాగించడంలో వారికి (ట్రాన్స్‌జెండర్లు) ఏదైనా సమస్య ఉంటే, వారు సంబంధిత శాఖను సంప్రదించి వారితో చర్చించాలని అన్నారు. జనవరి 7న ప్రారంభమైన గణన ప్రక్రియ 2023 మే నాటికి పూర్తవుతుంది. ఈ కసరత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన ఆకస్మిక నిధి నుంచి రూ.500 కోట్లు వెచ్చించనుంది. ఈ సర్వే బాధ్యతను సాధారణ పరిపాలన శాఖకు అప్పగించారు.