రీల్స్ చేసే నెపంతో కాబోయే భ‌ర్త గొంతు కోసిన మైన‌ర్ బాలిక

By Mahesh RajamoniFirst Published Apr 8, 2023, 4:17 PM IST
Highlights

Haveri: రీల్స్  చేసే నేపంతో ఒక మైనర్ బాలిక తనకు కాబోయే భర్తపై కత్తితో దాడి చేసింది. ఈ  షాకింగ్ ఘ‌ట‌న హావేరి జిల్లా  రాణేబెన్నూరు శివార్లలోని ఒక పబ్లిక్ స్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. ప్ర‌స్తుతం బాధితుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అయితే, పోలీసుల విచార‌ణ‌లో వెలుగుచూసిన విష‌యాల‌తో అంద‌రూ షాక్ గుర‌వుతున్నారు.
 

Karnataka Minor girl stabs fiance: టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత సోష‌ల్ మీడియా వాడ‌కం విప‌రీతంగా పెరిగిపోయింది. ఇక రీల్స్ చేయ‌డం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా రీల్స్ చేయడం.. మ‌రీ ముఖ్యంగా నేటి యువతరం రీల్స్ కు బానిసల‌య్యారా? అనే విధంగా ప‌రిస్థితి తయారైంది. అయితే, దీనినే అవకాశంగా తీసుకున్న ఒక‌ మైనర్ బాలిక తనకు కాబోయే భర్తపై కత్తితో దాడి చేసింది. ఈ షాకింగ్ ఘ‌ట‌న హావేరి జిల్లా  రాణేబెన్నూరు శివార్లలోని ఒక పబ్లిక్ స్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. అయితే, ప్ర‌స్తుతం బాధితుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసుల విచార‌ణ‌లో వెలుగుచూసిన విష‌యాలతో అంద‌రూ షాక్ గుర‌వుతున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. కర్ణాటకలోని హవేరి జిల్లాలో రీల్స్ చేసే నెపంతో కాబోయే భర్త మెడపై క‌త్తితో దాడి చేసింది ఒక 17 ఏళ్ల యువతి.  తీవ్రంగా గాయ‌ప‌డ్డ యువ‌కుడి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. రాణేబెన్నూరు పట్టణ శివారులోని ఓం పబ్లిక్ స్కూల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన దేవేంద్రగౌడ్ ను ఒక ప్ర‌యివేటు ఆస్పత్రికి తరలించగా, ఇంకా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. 

మైనర్ బాలిక దేవేంద్ర గౌడను పార్కుకు పిలిపించి తనకు గిఫ్ట్ ఇవ్వాలని, రీల్స్ చేసి మీ చేయి కట్టి ఫోటో తీద్దామని చెప్పింది. బాలిక ప్రేమ మాటలకు అంగీకరించిన దేవేంద్ర గౌడ కూడా అంగీకరించాడు. అందుకు మైనర్ అంగీకరించి చేతిని శిలువలా  క‌ద‌ల‌కుండా కట్టేసింది. .చూడు, ఇది నా గిఫ్ట్ అంటూ దేవేంద్ర గౌడ మెడలో బాలిక క‌త్తితో పొడిచింది. ఈ ఘ‌ట‌న‌కు సంబందించి పోలీసులు కేసు న‌మోదు చేశారు. విచార‌ణ‌లో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

తీవ్రంగా గాయపడిన దేవేంద్ర గౌడను దావణగెరెలోని ఓ ప్ర‌యివేటు ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై దేవేంద్ర గౌడ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ మేరకు హలగేరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కాగా, మార్చి 3న హరపనహళ్లి తాలూకాకు చెందిన దేవేంద్ర గౌడకు 17 ఏళ్ల మైనర్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే మైనర్ మరో యువకుడితో ప్రేమలో ఉంది. అలా తాను ప్రేమిస్తున్న  వ్య‌క్తి కోసం నిశ్చితార్థం చేసుకున్న యువకుడిని హతమార్చేందుకు ఆ బాలిక ఈ రీల్స్ పేరుతో కుట్ర‌కు తెర‌లేపింద‌ని పోలీసులు విచార‌ణ‌లో గుర్తించారు.

click me!