
న్యూఢిల్లీ: చంద్రుడిపై ప్రగ్యాన్ రోవర్ ప్రయాణం మొదలు పెట్టిందని ఇస్రో ప్రకటించింది. ఈ నెల 23వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన తర్వాత తన పనిని ప్రారంభించింది.
ల్యాండర్ లోని ప్రగ్యాన్ రోవర్ చంద్రుడిపై 14 రోజుల పాటు ప్రయాణం చేయనుంది. 14 రోజుల పాటు చంద్రుడిపై ప్రయాణించి పరిశోధనలు చేయనుంది. ల్యాండర్ నుండి బయటకు వచ్చిన రోవర్ చంద్రుడిపై పరిశోధనలను ప్రారంభించినట్టుగా ఇస్రో ప్రకటించింది.
also read:Chandrayaan-3 వెనుక ఉన్న ఐదుగురు ప్రముఖ శాస్త్రవేత్తలు.. 54 మంది మహిళా ఇంజినీర్లు..!
మరో వైపు చంద్రుడిపై భారత జాతీయ చిహ్నం, ఇస్రో లోగోను రోవర్ ముద్రించింది.చంద్రుడిపై వాతావరణం లేకపోవడంతో భారత జాతీయ చిహ్నం చెరిగిపోకుండా ఉంటుంది.చంద్రుడిపై 14 రోజుల పాటు ప్రగ్యాన్ రోవర్, ల్యాండర్ పనిచేయనుంది.చంద్రుడిపై కీలక పరిశోధనలు చేసి పంపనుంది.రోవర్ యొక్క అల్ఫా పార్టికల్ ఎక్స్ రే స్పెక్ట్రోమీటర్ చంద్రుడి ఉపరితలంపై అవగాహనన పెంచుకోవడంతో పాటు ఖనిజ సంబంధమైన మార్పును అంచనా వేయనుంది. విక్రమ్ ల్యాండర్ , రోవర్ మధ్య కమ్యూనికేష్ సక్రమంగా సాగుతుందని ఇస్రో తెలిపింది.