గడ్చిరోలిలో మందుపాతర పేల్చిన మావోలు: 15 మంది జవాన్లు మృతి

By narsimha lodeFirst Published May 1, 2019, 2:09 PM IST
Highlights

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని జాంబీర్ కేడ అటవీ ప్రాంతంలో జవాన్లు వెళ్తున్న వాహనం లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లు మృతి చెందారు.

గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని జాంబీర్ కేడ అటవీ ప్రాంతంలో జవాన్లు వెళ్తున్న వాహనం లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లు మృతి చెందారు..

బుధవారం నాడు ఉదయం  ఇదే జిల్లాలో  రోడ్డు నిర్మాణ పనులు నిర్వహించే సుమారు 27 మెషీన్లను మావోలు దగ్దం చేశారు. ఈ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని మావోలు డిమాండ్ చేశారు. సుమారు 150 మంది మావోలు ఈ దారుణానికి పాల్పడినట్టుగా స్థానికులు చెబుతున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే కూంబింగ్ కోసం వెళ్తున్న జవాన్ల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని మావోలు ఈ దాడికి తెగబడ్డారు.  ఈ ఘటనలో తొలుత 15 మంది జవాన్లు గాయపడ్డారని సమాచారం అందింది. అయితే ఈ వాహనంలో ఉన్నవారంతా మృతి చెందారని అధికారులు ప్రకటించారు.

గడ్చిరోలి జిల్లాలో మావోలు రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన వాహనాలను దగ్దం చేశారని సమాచారం రావడంతో క్విక్ రెస్పాన్స్ టీమ్‌కు చెందిన 15 మంది కమాండోలు  వెళ్తున్న వాహనాన్ని మందుపాతరతో పేల్చారని యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ ఐజీ శరద్ శేలర్ చెప్పారు. సంఘటన స్థలంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్ల సహాయం తీసుకొంటామని ఆయన తెలిపారు.

Official sources: 10 security personnel have lost their lives in an IED blast by Naxals in Gadchiroli. https://t.co/KB3rT3XOLK

— ANI (@ANI)
click me!