గట్టిగా పట్టుకుందని.. చేతి వేళ్లు నరికి బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన దొంగలు

sivanagaprasad kodati |  
Published : Dec 12, 2018, 10:51 AM IST
గట్టిగా పట్టుకుందని.. చేతి వేళ్లు నరికి బ్యాగ్‌ ఎత్తుకెళ్లిన దొంగలు

సారాంశం

ఢిల్లీలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. బ్యాగ్‌ను గట్టిగా పట్టుకోవడం వల్ల దొంగతనం చేయడం కుదరడం లేదనే కోపంతో మహిళ చేతివేళ్లను నరికి బ్యాగును లాక్కొని పరారయ్యారు. సంగమ్ విహార్‌కు చెందిన షాలినీ గార్గ్ నగరంలోనే ఉన్న తన బంధువును చూసేందుకు ఆటోలో ఆసుపత్రికి బయలుదేరింది.

ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె బ్యాగును లాక్కొనే ప్రయత్నం చేశారు. అయితే అది వారి చేతుల్లోకి వెళ్లకుండా ఆమె గట్టిగా పట్టుకుంది. దీంతో బైక్‌పై వెనుక కూర్చొన్న దుండగుడు పదునైన కత్తితో ఆమె మూడు చేతి వేళ్లను నరికి బ్యాగును లాక్కుపోయారు. బ్యాగులో రెండు బంగారు ఉంగరాలు, రూ.5 వేలు నగదు ఉన్నాయి. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

PREV
click me!

Recommended Stories

అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?
వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu