
భారత రిజర్వ బ్యాంక్ నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే ప్రస్తుతం ఆర్ధిక సంఘంలో సభ్యునిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న ఉర్జీత్ పటేల్ వ్యక్తిగత కారణాలతో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రిజర్వ్ బ్యాంక్‌కు కొత్త గవర్నర్‌ను నియమించవలసిన పరిస్థితి ఏర్పడింది.