మూఢనమ్మకంతో అడ్డంగా బుక్కైన గజదొంగలు.. పిల్లి అడ్డొచ్చిందని..!

Published : Aug 19, 2023, 08:27 PM IST
మూఢనమ్మకంతో అడ్డంగా బుక్కైన గజదొంగలు.. పిల్లి అడ్డొచ్చిందని..!

సారాంశం

దొంగిలించడానికి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. బాగానే చోరీ చేసి డబ్బు, నగలను పోగు చేశారు. కానీ, ఓ చోట దొంగతనం పూర్తి చేసుకుని తిగిరి వెళ్లుతుండగా వారి దారికి ఓ పిల్లి ఎదురొచ్చింది. దీన్ని అపశకునంగా భావించి కాసేపు అక్కడే ఆగిపోయారు. పర్యవసానంగా వారు పోలీసులకు దొరికిపోయారు.  

న్యూఢిల్లీ: ఇప్పటికీ మూఢనమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి. అదో మానసిక జబ్బు. దీనికి మంచి వారు చెడ్డవారు అనే తేడా లేదు. ఎవరికైనా అంధ విశ్వాసాలు ఉండొచ్చు. తలపెట్టేదే ఓ పాపకార్యం.. దానికి మళ్లీ పట్టింపులు. ఆ ముగ్గురు గజ దొంగల పరిస్థితి ఇదే. పోలీసులకు చిక్కకుండా హస్తలాఘవంతో పలు చోరీలు విజయవంతంగా చేశారు. అయితే.. చివరి దొంగతనంలో మాత్రం మూఢనమ్మకంతో పోలీసుల చేతికి చిక్కారు. ఓ చోట దొంగతనం చేసి పారిపోతుండగా పిల్లి అడ్డొచ్చిందని, అపశకనంతో తమకేమైనా జరగొచ్చని కాసేపు ఆగిపోయారు. అంతే.. పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో చోటుచేసుకుంది.

ఝాన్సీలో కొన్ని రోజులుగా దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. చోరీల కేసులు పెరుగుతున్నాయి. కానీ, దొంగలు దొరకడం లేదు. యూపీ పోలీసులకు వీరిని పట్టుకోవడం ఓ సవాల్‌గా మారిపోయింది. అయితే.. ఆ ముఠా చివరి చోరీలో పిల్లి అడ్డొస్తే అపశకునం అనే నమ్మకంతో కదలకుండా ఉండిపోయారు. ఇంతలో పోలీసులు స్పాట్‌కు రావడంతో చిక్కిపోయారు. ఈ ముగ్గురు మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. అమిత్ పాఠక్ సోను, సైనిక్, రాహుల్ సేన్‌లుగా ఆ దొంగల ముఠాను గుర్తించారు. వారి నుంచి డబ్బు, నగలను పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఎన్నికల ముందు పెట్రోల్ రేట్లు తగ్గిస్తారా?: ఇదీ కేంద్రమంత్రి సమాధానం

ఈ దొంగలను విచారింగానే.. ఈ ఆసక్తికర విషయం బయటపడింది. తాము దొంగతనం పూర్తి చేసుకుని తిరిగి వెళ్లుతుండగా తమకు ఓ పిల్లి ఎదురైందని, దాంతో తమకు చెడు జరుగుతుందని భయపడి పారిపోకుండా అక్కడే నిలబడిపోయామని ఓ దొంగ చెప్పాడు. ఝాన్సీలో జరిగిన పలు చోరీలలో వీరి ప్రమేయం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu