రోడ్లు దారుణంగా ఉన్నాయ్.. కొన్ని జిల్లాలకు ట్రైన్‌పై వెళ్లాను: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తమిళనాడు సీఎం లేఖ

Published : Feb 12, 2023, 04:04 PM IST
రోడ్లు దారుణంగా ఉన్నాయ్.. కొన్ని జిల్లాలకు ట్రైన్‌పై వెళ్లాను: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి తమిళనాడు సీఎం లేఖ

సారాంశం

తమిళనాడులో రోడ్లు దారుణంగా ఉన్నాయని ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. తమ ఎంపీ పార్లమెంటులో లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదనీ అన్నారు. కొన్ని జిల్లాలకు వెళ్లాలంలే రోడ్ల బాగుండని కారణంగా ట్రైన్‌లో పర్యటించి వచ్చారని వివరించారు.  

చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శనివారం కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. చెన్నై నుంచి రాణిపేట్‌ను కలిపే నేషనల్ హైవే రోడ్డు దారుణంగా ఉన్నదని పేర్కొన్నారు. అందుకే ఇటీవలే తాను కొన్ని జిల్లాలకు వెళ్లినప్పుడు రోడ్డుపై కాకుండా ట్రైన్‌లో వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

చెన్నై, దాని పోర్టులను, ఇండస్ట్రియల్ క్లస్టర్లు కాంచీపురం, వెల్లూర్, రాణిపేట్, హోసూర్, క్రిష్ణగిరిలను కలిపే దారులు చాలా కీలకమైనవని ఆయన తెలిపారు. తమ ఎంపీ దయానిధి మారన్ పార్లమెంటులో ఈ విషయమై అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి చాలా జనరల్‌గా సమాధానం ఇచ్చాడని, అందులో కచ్చితంగా ఈ చర్యలు తీసుకుంటామనే సంకల్పం కనిపించలేదని వివరించారు.

‘చెన్నై నుంచి రాణిపేట్ (ఎన్‌హెచ్ 4)ను కలుపుతున్న జాతీయ రహదారి దారుణంగా ఉన్నదని, దీన్ని మెరుగుపరచాలని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ పార్లమెంటులో మీకు విజ్ఞప్తి చేశారని సీఎం స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఈ లేఖ రాసినట్టు వివరించారు. తమ ఎంపీ లేవనెత్తిన విషయాలు చాలా ముఖ్యమైనవని, కానీ, వాటికి మీ సమాధానం తమను నిరాశపరిచిందని తెలిపారు.

Also Read: అయోధ్య తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు మాజీ జడ్జీకి గవర్నర్ పోస్ట్.. ఏపీ గవర్నర్‌గా జస్టిస్ ఎస్ఏ నజీర్

తమ రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్ఏఐకి సహకరించడం లేదనీ కేంద్రం ఆరోపణలు చేసిందని, ఇది సరికాదని కొట్టివేశారు. ‘రాష్ట్రంలో ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్టులకు తమ రాష్ట్ర ప్రభుత్వం చేసిపెట్టిన పనులను మీ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను. చెన్నై పోర్టు నుంచి మదుర్వోయల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టుకు అన్ని రకాల సహకారాలు అందించి రివైవ్ చేయగలిగామని, ఇందులో రాయల్టీ ఆన్ అగ్రిగేట్స్ కూడా మినహాయింపు కల్పించామని గుర్తు చేశారు. మిగితా ఎన్‌హెచ్ఏఐ ప్రాజెక్టులకూ గతంలో ఎన్నడూ ఇవ్వని విధంగా సహాయం, మినహాయింపులు అందిస్తున్నామని తెలిపారు. పర్మిషన్లకు సంబంధించి రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు పెండింగ్‌లో లేదని స్పష్టం చేశారు.

కాబట్టి, తాము లేవనెత్తిన అంశాలపై మీరు మీ అధికారులకు స్పష్టమనైన ఆదేశాలు జారీ చేస్తే సంతోషిస్తామని స్టాలిన్ అన్నారు. రోడ్లు సరిగా లేక.. ప్రజలు రోజూ అవస్థలు పడటం మూలంగా ఎన్‌హెచ్ఏఐ సంస్థలపై ప్రజల్లోనూ దురభిప్రాయం కలుగుతుందని వివరించారు.     

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం