తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, 7 గురు మృతి, 8 మంది పరిస్థితి విషమం...

By SumaBala Bukka  |  First Published Oct 24, 2023, 6:26 AM IST

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువన్నామలై దగ్గర సుమోను లారీ ఢీ కొనడంతో ఏడుగురు మృతి చెందారు. 


చెన్నై : మంగళవారం ఉదయం తమిళనాడులోని చెన్నైలో పెను విషాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురిని బలి తీసుకుంది.  తమిళనాడులోని తిరువన్నామలై దగ్గర ఓ ఆర్టీసీ బస్సు.. సుమోను ఢీ కొట్టింది. సింగం బైపాస్ పై సుమోను.. బస్సు ఢీ కొట్టింది. దీంతో సూమోలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం గురించి తెలియడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వారందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

click me!